Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చరిత్ర ఎప్పుడూ విజేతలకు మాత్రమే పెద్ద పీట వేస్తుందన్న ఓ నమ్మకం వుంది.కానీ చరిత్ర చిత్రాన్ని బాగా చెక్కితే చిన్నచిన్న విషయాలు,వ్యక్తులు కూడా అలా చరిత్రలో నిలిచిపోతారు.రోమన్ నియంత జూలియస్ సీజర్ ని క్రీస్తు పూర్వం 44 సంవత్సరంలో చంపేశారు.ఆయన్ని సొంత సెనేటర్స్ దాడి చేసి చంపేశారు.ఆ దాడిలో పాల్గొన్న వారిలో తన ప్రియ మిత్రుడు అనుకున్న బ్రూటస్ కూడా వున్నాడని గుర్తించిన సీజర్ చివరి క్షణాల్లో”బ్రూటస్ నువ్వు కూడా ” అని అన్నాడట.అందులో నిజమెంతున్నా షేక్ స్పియర్ రాసిన జూలియస్ సీజర్ నాటకంలోని “యు టు బ్రూటస్ “అన్న డైలాగు ఫేమస్ అయిపోయింది.ఆ డైలాగ్ వల్ల నిజంగా అప్పట్లో సీజర్ అలా అని ఉండొచ్చని బలంగా నమ్మేవాళ్ళు చాలా మంది.కానీ వీరిలో చాలా మందికి షేక్ స్పియర్ ఆ నాటకం రాసింది 1599 లో అని తెలియదు.కానీ షేక్ స్పియర్ సృజన ఇప్పటికీ ఓ చరిత్రని,అందులో నమ్మకద్రోహం చేసిన బ్రూటస్ లాంటి వాడిని కూడా గుర్తు ఉండేట్టు చేసింది.
ఇప్పుడు దర్శక బాహుబలి రాజమౌళి పుణ్యమా అని బ్రూటస్ ప్లేస్ లోకి కట్టప్ప వచ్చి చేరేట్టు వున్నాడు.షేక్ స్పియర్ చరిత్రని ఆధారం చేసుకుని నాటకం రాస్తే,బాహుబలి పూర్తిగా రాజమౌళి ఊహల్లోనుంచి పుట్టింది.విజయేంద్రప్రసాద్ ఆలోచనల్లో ఊపిరిపోసుకుంది.కానీ ఆ జానపద కథ నిజమనేంతగా జనంలోకి వెళ్ళింది.అందుకే తెరాస నేతలు కెసిఆర్ ని తెలంగాణ బాహుబలి అని పొగుడుతుంటే,వాళ్లకి కౌంటర్ ఇస్తున్న కాంగ్రెస్ నేతలు మాత్రం కట్టప్ప లు కూడా వున్నారు చూసుకోండని హెచ్చరిస్తున్నారు.ఒకప్పుడు అయితే ఈ ఉపమానంలో బ్రూటస్ ని వాడేవాళ్ళేమో ..ఇప్పుడు కట్టప్ప సీన్ లోకి వచ్చాడు.అంతా రాజమౌళి మహిమ..కాదంటారా?