వామ్మో.. అఖిల్ ఫైట్స్ కే అంత భారీ బడ్జెటా?

0
497
budget-for-akhil-fights-in-his-second-movie

budget-for-akhil-fights-in-his-second-movie

అక్కినేని వారసుడు అఖిల్ తన పెళ్లి రద్దు భాగోతం నుంచి కాస్త బయటపడ్డట్లు ఉన్నాడు. తన రెండో సినిమా పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తిచేస్తున్నాడు. మనం సినిమా దర్శకుడు విక్రమ్ కె. కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

అఖిల్ మొదటిసినిమా డిజాస్టర్ అవ్వడంతో రెండో సినిమాను చాలా కేర్ ఫుల్ గా చిత్రీకరిస్తున్నాడట దర్శకుడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేసే విక్రమ్ మొదటిసారి అఖిల్ తో యాక్షన్ మూవీ చేయబోతున్నాడు. సినిమాలో హాలీవుడ్ తరహా ఫైట్స్ ను పెట్టాలని భావిస్తున్నాడట. అంతే కాదు ఈ సినిమా మొత్తం బడ్జెట్ రూ. 40 కోట్లు ఉండగా,  కేవలం అఖిల్ ఫైట్స్ కి మాత్రమే రూ. 20 కోట్లను వెచ్చించాడట. మరి ఇంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

 

Leave a Reply