మేటి డోనరుడికి బంపర్ ఆఫర్

Posted January 5, 2017

bumper offer to sperm donar
ఆ మధ్య హిందీ విక్కీ డోనర్ పేరుతో సినిమా వచ్చింది. వీర్యదానం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటి పరిస్థితులను ప్రతిబింబించింది. తెలుగులోనూ నరుడా..డోనరుడా పేరుతోనూ సినిమా తీశారు. వీర్యానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఈ సినిమాలు చాటిచెప్పాయి.

వీర్యానికి ఇప్పుడు ప్రాధాన్యత చాలా పెరిగింది. పోషకాహారం, పని ఒత్తిడి, ఇతరత్రా కారణాలతో వీర్యకణాల సంఖ్య తగ్గిపోతోంది. దీని వల్ల చాలామంది సంతాన భాగ్యానికి నోచుకోవడం లేదు. చివరకు వైద్యులు ఇతర వ్యక్తుల నుంచి వీర్యాన్ని సేకరించి… సంతాన భాగ్యాన్ని కల్పించాల్సి వస్తోంది. చివరకు అండం విషయంలోనూ అంతే.

సాధారణంగా వీర్యం.. అండం దానమిచ్చే వారికి కొద్ది మొత్తంలో డబ్బు అందుతుంది. అమెరికాలోని డెలావర్ ప్రాంతంలోని ప్యురెనెటిక్ ఎల్ఎల్సీ సంస్థ మాత్రం దాతలకు భారీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వీర్యానికి ఏకంగా రూ. 3.5కోట్లు ఇస్తామని ప్రకటించింది. అయితే అందుకు కొన్ని షరతులు విధించింది. అయితే అది మేటి వీర్యం, అండం అయి ఉండాలట.

పురుషుల్ని వీర్యం.. మహిళల్ని అండాలను దానం చేయమని ఈ సంస్థ ఆహ్వానిస్తోంది. దానం చేయాలనుకునే వారు తొలుత సంస్థ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. దంపతులు గానీ, వేరు వేరు వ్యక్తులు గానీ వారి పేర్లని రిజిస్టర్ చేసుకోవచ్చట. ఎంపిక చేసిన వారి నుంచి వీర్యం, అండం సేకరించి పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అంతకు ముందే వీర్యం, అండం దానం చేసిన వారి విద్యాబుద్ధులు, కుటుంబ నేపథ్యం, ఆరోగ్య పరిస్థితి, డీఎన్ఏలను పరిశీలిస్తారు. ఆయా అంశాల్లో ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటే వారి నుంచి మాత్రమే వీర్యం.. అండం సేకరిస్తారు. ఇలా తమకు కావాల్సిన వీర్యం, అండం దానం చేసిన వారికి రూ. 3.5కోట్ల రూపాయలు అందిస్తారట. దీంతో ఈ బంపర్ ఆఫర్ కోసం భారీ సంఖ్యలోనే దరఖాస్తులు వెల్లువెత్తాయి.

SHARE