ఫ్లాష్… డీజేలో బన్నీ పాత్ర ఇదేనట!!

0
274
bunny character in dj leak

Posted [relativedate]

ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తున్న సినిమాల్లో డీజే మూవీ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో బన్నీ పాత స్కూటర్ పై కూరగాయలు తేవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.  

సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో బన్నీ బ్రాహ్మణ యువకుడిగా కనిపించాడు. దీంతో అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ తరహా పాత్రనే బన్నీ చేస్తున్నాడని అభిమానులు ఎక్స్ పెక్ట్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం అదుర్స్  లో ఎన్టీఆర్ మాదిరిగా బన్నీ డీజేలో  పౌరోహిత్యం చేయడని తెలుస్తోంది. కేటరింగ్  బిజినెస్ చేసే బ్రాహ్మణ ఫ్యామిలీకి చెందినవాడిగా బన్నీ కనిపిస్తాడట. విజయవాడలోని  సత్యనారాయణపురంలో  ‘అన్నపూర్ణ కేటరింగ్స్ .. ప్యూర్ వెజిటేరియన్స్’ అనే కేటరింగ్ సంస్ద నడుపుతూ కథ సాగుతుందట. కేటరర్స్ కు చెందిన లోగో కూడా ఈ స్కూటర్ కి ఉండటం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. డిఫరెంట్ రోల్స్ మీద దృష్టి పెట్టే బన్నీ ఈ  సారి మరింత డిఫరెంట్ పాత్రనే ఎంచుకున్నాడని అంటున్నారు.

Leave a Reply