డిజ్ లైకుల్లోనూ బన్నీదే రికార్డు..!!

0
306
bunny dislikes record for dj

Posted [relativedate]

bunny dislikes record for djటాలీవుడ్ హీరో అల్లు అర్జున్.. సోషల్ మీడియాలో దూసుకుపోవడంలో తిరుగులేని స్టైలిష్ స్టార్. ట్విట్ట‌ర్‌లో ఏ  సౌత్ ఇండియ‌న్ హీరోకీ లేనంత మంది ఫాలోవ‌ర్స్ బన్నీకి ఉన్నారు. బన్నీకి సంబంధించిన ఏ వార్తైనా సోష‌ల్ మీడియాలో హాట్ హాట్‌ గా పాకిపోతుంటుంది. అలాంటి బ‌న్నీ పాజిటివ్ గానే కాదు నెగిటివ్ గా కూడా పేమస్ అయిపోయాడు. సోష‌ల్ మీడియాలో దాదాపు అన్నీ రికార్డులను బ్రేక్ చేసుకుంటూ  వెళ్తున్న  బన్నీకి అక్కడే గట్టి షాక్ త‌గిలింది. త‌న కెరీర్‌లోనే చెత్త రికార్డు బ‌న్నీ వ‌శ‌మైంది.

వివరాల్లోకి వెళ్తే…

అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టించిన దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ టీజ‌ర్ ఇటీవ‌లే విడుద‌లైందన్న సంగతి తెలిసిందే. ఈ టీజ‌ర్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ కాంట్ర‌వ‌ర్సీ న‌డుస్తూనే ఉంది. టీజ‌ర్ బాగుందని ఎంతమంది లైకులు కొట్టారో అంతమంది డిజ్ లైకులు కొట్టినవారు ఉన్నారు. బ‌న్నీ టీజ‌ర్‌ని దాదాపు 50 లక్ష‌ల‌మంది వీక్షించారు. లైక్‌లు ల‌క్ష ఉంటే.. దానికి స‌మానంగా డిజ్ లైకులు కూడా వ‌చ్చాయి. పనికట్టుకుని  కొంత‌మంది ఈ టీజ‌ర్‌కి డిజ్ లైకులు కొడుతూ బన్నీని అప్ర‌తిష్ట పాలు చేస్తున్నార‌ని అతని  అభిమానులు ఆక్రోశం వ్య‌క్తం చేస్తున్నారు.    ఓ స్టార్ హీరో టీజ‌ర్‌కి ఇన్ని డిజ్ లైకులు రావ‌డం ఇదే తొలిసారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అజిత్ న‌టించిన వేదాళం టీజ‌ర్‌కి 70 వేల‌కు పైగా డిజ్ లైక్‌లు రాగా బన్నీ ఆ రికార్డు కూడా బద్దలు కొట్టి  సౌతిండియాలోనే  చెత్త‌ రికార్డ్‌ ని నమోదు చేశాడని అంటున్నారు. మరి సినిమా రిలీజయ్యాక బన్నీ ఏ రికార్డులను ఏ విధంగా బద్దలు కొడతాడో చూడాలి.

Leave a Reply