స్నేహా డెలివరీ తర్వాతే.. డీజే షూటింగ్ !

 Posted October 19, 2016

bunny join dj movie shooting after sneha reddy delivery

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ‘డీజే.. దువ్వాడ జగన్నాథం’ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బన్ని సరసన పూజ హెగ్డే జతకట్టనుంది. ఈ చిత్రం ఈ నెల 21 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

అయితే, బన్ని మాత్రం భార్య స్నేహా రెడ్డి డెలివరీ అయ్యే వరకు డీజే షూటింగ్ లో పాల్గొనేది లేదని నిర్ణయించుకొన్నాడట. బన్నీ భార్య స్నేహా రెడ్డి ఇప్పుడు ప్రెగ్నెంట్‌.  వచ్చే నెలలో ఆమె రెండో బిడ్డకు జన్మనిచ్చే అవకాశముంది. వచ్చే నెలలో లిటిల్‌ అల్లు రానున్నాడని బన్నీ భార్య స్నేహ తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ నేపథ్యంలో.. డీజే మరింత డిలే కానుందనే ప్రచారం జరుగుతోంది.అయితే, ఈలోపు హైదరాబాద్ షెడ్యూల్ లో ఇతర నటీనటులపై సన్నివేశాలని పూర్తి చేసే పనులకి దర్శకుడు హరీష్  ప్లాన్ చేసుకొంటున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్.

SHARE