బన్నీ కి విలన్ అల్లు అర్జున్ ?

Posted September 27, 2016

 bunny lingusamy movie allu arjun act villan role
లింగుస్వామి దర్శకత్వంలో బన్నీ చేయబోతున్న ద్విభాషా చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది.ఇందులో బన్నీ డ్యూయల్ రోల్ చేస్తున్నారట. అయితే ఒక పాత్ర కథానాయకుడిది అయితే..రెండో పాత్ర ప్రతినాయకుడిది కావచ్చట.విలన్ ఛాయలున్న ఆ పాత్ర చేయొచ్చా ,లేదా అని తేల్చుకోలేకే లింగుస్వామి విషయంలో బన్నీ ఇంత టైం తీసుకున్నారంట.ఇక ఆ కథ ఎన్టీఆర్ దగ్గరకు వెళుతుందన్న సమయంలో బన్నీ ఆ సినిమాకి ఓకే చెప్పారంట.

బయటికి వినిపిస్తున్న ఈ వార్త నిజమైతే బన్నీ టాలీవుడ్ లో పెద్ద ప్రయోగం చేసినట్టే.హీరోగా చేస్తున్న సినిమా లోనెగటివ్ షేడ్ ఉన్న పాత్రకి ఒప్పుకోవడం అంత తేలిగ్గాదు.వాలి లాంటి సినిమాలో అజిత్ ..సుల్తాన్ చిత్రంలో బాలకృష్ణ ఇలాంటి ప్రయత్నం చేశారు.ఈ తరం హీరోల్లో ఆ క్రెడిట్ బన్నీ కి దక్కుతుంది.

SHARE