బన్నీ కొత్త సినిమా టైటిల్ ఇదేనా?

Posted February 13, 2017

bunny new movie title releasedరేసుగుర్రం, S/O సత్యమూర్తి, సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో  అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం దువ్వాడ జగన్నాధం సినిమాతో బిజీగా ఉన్నాడు  ఈ స్టైలిష్ స్టార్.  సమ్మర్ లో ఈ సినిమా  రిలీజ్ కి  రెడీ అవుతుండడంతో బన్నీ తన నెక్ట్స్ సినిమాలను లైన్లో పెట్టేశాడు. లింగుస్వామి దర్శకత్వం లో తెలుగు , తమిళ్ భాషలలో తెరకెక్కబోయే చిత్రంతో పాటు బన్నీ.. వక్కంతం వంశీ దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నాడు.

ఎవడు, టెంపర్, రేసుగుర్రం వంటి సినిమాలకు మాటల్ని  అందించిన వక్కంతం వంశీ.. ఈ సినిమాతో దర్శకుడిగా మారనున్నాడు. కాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. లగడపాటి శ్రీధర్ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమాకి “నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా” అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని సమాచారం.  బన్నీ.. తన సినిమాలకు ఇలా టైటిల్స్ తోనే క్రేజ్ తెప్పిస్తాడని చెప్పుకుంటున్నారు.  నా ఇల్లు ఇండియా అని చెబుతున్న సూర్య ఎప్పుడు పట్టాలెక్కుతాడో చూడాలి.

SHARE