బన్ని కూడా మొదలెట్టాడు..!

bnn1ఈ ఇయర్ సరైన హిట్ అందుకున్న సరైనోడు అల్లు అర్జున్ ఇప్పుడు తన తర్వాత సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. హరీష్ శంకర్ డైరక్షన్లో దువ్వాడ జగన్నాథం సినిమా చేస్తున్న అల్లు అర్జున్ లాస్ట్ మంత్ ముహుర్తం పెట్టినా రేపటి నుండి తను షూట్లో జాయిన్ అవుతున్నాడు. బన్ని మార్క్ స్టైలిష్ ఎంటర్టైనింగ్ కథతో వస్తున్న ఈ సినిమాలో లుక్ కూడా చాలా కొత్తగా ఉంటుందట. మొన్నటిదాకా బన్ని లేకుండానే మిగతా స్టార్ కాస్ట్ తో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ షూటింగ్ లో రేపటి నుండి బన్ని కూడా జాయిన్ అవుతున్నాడు.

మెగా హీరోలకు సూపర్ హిట్లు ఇచ్చిన హరీష్ శంకర్ అల్లు అర్జున్ కు హిట్ ఇస్తాడనడంలో సందేహం లేదు. పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాతో మరోసారి తన స్టామినా చూపించాలని బన్ని ఆరాటపడుతున్నాడు.

SHARE