వైసీపీ లో ఎందుకిలా అవుతోంది?

0
327
buragadda vedavyas change ycp to tdp party

 Posted [relativedate]

 buragadda vedavyas change ycp to tdp party

ఓ వైపు ముద్రగడ ఆధ్వర్యంలో కాపు రిజర్వేషన్ ఉద్యమం ఊపందుకుంటోంది..మరో వైపు అ ఉద్యమానికి అండదండగా ఉంటామని వైసీపీ ప్రకటిస్తోంది.ముద్రగడ సమావేశాలకు హాజరయ్యే కాపు నాయకుల్లో 90%మంది వైసీపీ నేతలే.దీంతో క్షేత్ర స్థాయిలో మార్పు రావాలని వైసీపీ కోరుకుంటోంది.ఇలాంటి కీలక సమయంలో వివాదరహితుడు,సౌమ్యుడిగా పేరు పడ్డ నేత బూరగడ్డ వేదవ్యాస్ టీడీపీలోకి చేరేందుకు నిర్ణయించుకోవడం వైసీపీ వర్గాలకి షాక్ ఇస్తోంది.అయన ముఖ్యమంత్రి చంద్రబాబుని కూడా కలిసి ఈ నెల 21 న పార్టీ మారడానికి డిసైడ్ అయ్యారు.

నిర్ణయం తీసుకోబోయేముందు పెడనలో జరిపిన ముఖ్య అనుచరుల సమావేశంలో వైసీపీ లో తనకు జరుగుతున్న అవమానాల్ని బూరగడ్డ వారికి చెప్పుకుని బాధపడ్డారు.సహజ శైలికి భిన్నంగా మాట్లాడిన బూరగడ్డ రాజకీయాలకే దూరంగా వుందామనుకున్నారట.అయితే అయన కుమారుడు,సోదరుడు ఒప్పించి ఆయన్ను టీడీపీ వైపు నడిపించినట్టు తెలుస్తోంది.ఈ పరిణామం ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా చూడలేమని …పార్టీ అధినాయకత్వంలో కాపునేతలతో వ్యవహరించే తీరు మారాలని ఇప్పుడు జగన్ కి దగ్గరగా ఉంటున్న అదే సామాజిక వర్గానికి చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.ఆ మాట పక్కనున్న అధినేత చెవిలో వేయలేక ఇలా బయటికొచ్చి మాట్లాడ్డం తోనే అక్కడి పరిస్థితి అర్ధమవుతోంది.ఆ పరిస్థితి ముందు మారాలి.

వైసీపీ ని రాజకీయ లాభనష్టాల కన్నా వ్యక్తిగత అవమానాలు తట్టుకోలేక వీడివచ్చినవాళ్ళే ఎక్కువ.ఇందులో ఒక్క సామాజిక వర్గం అనిలేదు.సొంత సామాజిక వర్గనేతలకి కూడా జగన్ నుంచి ఇలాంటి అనుభవం ఎదురైంది.ఇందుకు ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో బాగా పేరున్న ఓ మాజీ ఎంపీ ఎన్నికలకి ముందు వైసీపీ లో చేరదామని లోటస్ పాండ్ వెళితే రెండుగంటల వెయిటింగ్ తర్వాత రెండు నిమిషాల టైం ఇచ్చి …షరతులన్నీ తెలిపి ఇష్టమైతే పార్టీలో చేరొచ్చని చెప్పి జగన్ అక్కడనుంచి వెళ్లిపోయారట.కనీస మర్యాద దక్కక వ్యాపార కుటుంబాన్నుంచి వచ్చిన ఆ నేత ఇక జన్మలో ఆయన్ను కలవకూడదని డిసైడ్ అయిపోయారు. అక్కడికి వచ్చి తప్పు చేశాననుకుంటూ,కోపం అణుచుకోలేక జేబులో పెన్ తీసి విసిరేసి అక్కడనుంచి బయటపడ్డారంట.

Leave a Reply