మోదీని ఉతికేసిన శివసేన పత్రిక

0
401

Posted [relativedate]

bjpsena
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడిచే ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన ్న శివసేన ప్రతిపక్షాలతో కలసి ఢిల్లీ వీధుల్లో నిరసన తెలిపింది.. ఈ చర్యకే బీజేపీ గుర్రుగా ఉంది.. అలా అసంతృప్తి ఉన్న తరుణంలోనే తన అధికారిక పత్రిక సామ్నలో ఆ పార్టీని ఉతిక ఆరేసింది. నోట్లు రద్దు చేసి మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల అమాయకులు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారని.. సామాన్యులను ఆకలితో మాడ్చి చంపినట్లేనంటూ విరుచుకుపడింది. ఈ వ్యవహారాన్ని జలియన్‌వాలాబాగ్‌తో పోల్చుతూ తీవ్రపదజాలం వాడింది. జనాలను క్యూలైన్లలో నిలబెడితే అది దేశభకి ్త అవుతుందా అని ప్రశ్నంచింది. అలా చేస్తేనే దేశభక్తి అని పోల్చడం అవమానకరం.. అలా మాట్లాడేవారి నాలుకులు కోసిన తప్పులేదని ఆగ్రహాం వ్యక్తం చేసింది. బాలాసాహెబ్‌ బతికుంటే ఆ పని చేసేవారని ప్రజలు బలంగా నమ్ముతున్నట్లు పేర్కొంది. దీనితోపాటు నోటు మార్పిడి సమయంలో చేతికి ఇంకు పూయడాన్ని కూడ జాతీయ నేరమంటూ మోదీ నిర్ణయాలను.. దాని పర్యవసానాలను ఎండగట్టింది.. మరోవైపు ఎన్డీయేలో ఉంటూ ఇలా వ్యవహరించడం సరికాదని హోంమంత్రి రాజనాథ్‌సింగ్‌ శివసేన అధినేత ఉద్దవ్‌థాక్రేకి కాల్‌చేసి మాట్లాడారట.. దానికి ప్రజాసమస్యలపై స్పందించామని దానికి తప్పేంటని ప్రశ్నించినట్లు తెలుస్తుంది.

Leave a Reply