Posted [relativedate]
బుర్రా సాయి మాధవ్ …కృష్ణం వందే జగద్గురుం నుంచి అయన చేసిన సినిమాలు,రాసిన మాటలు చాలు రచయితగా ఆయనేమిటో చెప్పేందుకు.అందుకే పరిశ్రమలో ఎందరు దిగ్గజాలున్న మెగా స్టార్ 150 వ సినిమాకి పాక్షికంగా,నటసింహం 100 వ సినిమాకి పూర్తి స్థాయిలో పని చేసే అవకాశం దొరికింది.ఈ కాలంలో గౌతమీపుత్ర లాంటి సినిమాకి పని చేసే అవకాశం రావడం,అంతే స్థాయిలో మంచి మాటలు రాసి పేరు తెచ్చుకోవడం చిన్న విషయాలేమీ కాదు.బుర్రా సాయి మాధవ్ మాత్రం ఆ పేరు తెచ్చుకున్నాడు.వయసులో చిన్నవాడైనా అతనికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా అంటూ గీత రచయిత సిరి వెన్నెల అయన గురించి చెప్పిన రెండు మాటలు చాలు ఓ రైటర్ గా సాయి మాధవ్ ఏమిటో చెప్పేందుకు .
ఎదిగేకొద్దీ ఒదగాలనే మాటకి కట్టుబడుతున్నాడు సాయి .అందుకే శాతకర్ణి ట్రైలర్ చూసి రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు సంక్రాంతికి వార్ వన్ సైడ్ అన్నప్పటికీ …సాయి దాన్ని ఆమోదించడం లేదు.అలాంటి మాటల మీద నమ్మకం లేదని …సినిమా అనేది ఓ వ్యక్తితో సాధ్యమయ్యేది కాదని అది ఓ వ్యవస్థ అని చెప్పాడు. ఖైదీ నెంబర్ 150 కి కూడా కొన్ని డైలాగ్స్ రాసిన బుర్రా మెగా స్టార్ ప్రశంసలు పొందాడు.శాతకర్ణి తో బాలయ్య సెహబాష్ అన్నాడు.మున్ముందు బుర్రా మరెన్నో మంచి సినిమాలకి పని చేయాలని …తెలుగు పరిశ్రమ స్థాయిని పెంచేందుకు తన వంతు ప్రయత్నం చేయాలని ఆశిద్దాం.