చెప్పు తెగుద్ది ..నట్టి కి వార్నింగ్

  c kalyan warning natti kumar
సినీ రంగం వ్యక్తుల మీద నయీమ్ తో సంబంధాలున్నాయని ఆరోపించిన నట్టి కి గట్టి షాక్ లే తగులుతున్నాయి.నిర్మాతల మండలి ఆయన ఆరోపణల మీద మండిపడితే …తాజాగా మరో ప్రొడ్యూసర్ ఫైర్ అయిపోయాడు.నయీమ్ తో తనకెలాంటి సంబంధాలు లేవని చెప్పిన సి.కళ్యాణ్ ..ఆ ఆరోపణలు చేసిన నట్టి మీద విరుచుకు పడ్డాడు.నోరుజారితే చెప్పుతెగుద్ది ,తాట తీస్తానని మీడియా సమక్షంలోనే చెలరేగిపోయాడు.

నట్టి పెద్ద బ్లాక్ మెయిలర్ అని కళ్యాణ్ అన్నాడు.అయన వల్ల వైజాగ్ లో చాలామంది నష్టపోయారని చెప్పాడు.నట్టిని భరించలేకే వైజాగ్ నుంచి తన్ని తరిమేశారని కళ్యాణ్ వివరించాడు.నయీమ్ తో తనకు సంబంధాలు ఉన్నట్టు రుజువులుంటే బయట పెట్టాలని కళ్యాణ్ సవాల్ విసిరాడు.మొత్తానికి నయీమ్ విషయంలో చిత్ర రంగం మీదకి నట్టి విసిరిన రాళ్లు తిరిగి ఆయన మీదే పడుతున్నాయి.

SHARE