Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ కవి సి.నారాయణ రెడ్డి ఈ ఉదయం కన్నుమూశారు. 1931 ,జులై 29 న కరీనగర్ జిల్లా లోని ఓ మారుమూల పల్లె హనుమాజీపేటలో ఆయన పుట్టారు.మల్లారెడ్డి అనే రైతు కుటుంబంలో పుట్టిన సినారె ప్రాధమిక విద్య వీధిబడిలో సాగింది .సిరిసిల్లలో ఉర్దూ మీడియం లో మాధ్యమిక విద్య,కరీంనగర్ ల ఉన్నత పాఠశాల విద్య అభ్యసించారు.ఓ వైపు విద్యాభ్యాసం చేస్తూనే హరికథలు,జానపదాలు,జంగం కథలవైపు సినారె ఆకర్షితుడయ్యాడు.హైదరాబాద్ చాదర్ ఘాట్ కాలేజీ లో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ చదివారు. అప్పటిదాకా ఉర్దూ మీడియం లో చదివిన సినారె పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి వచ్చేసరికి తెలుగు సాహిత్యాన్ని ఎంచుకున్నారు.
1953 లో “నవ్వని పువ్వు”పేరుతో సినారె తొలి రచన చేశారు.సికింద్రాబాద్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా,ఆ పై నిజాం కాలేజీ లో లెక్చరర్ గా పని చేశారు సినారె.కవిగా ఆయన చేయని ప్రయోగాలు లేవు.పద్య కావ్యాలు,గేయ కావ్యాలు,వచన కవితలు,గద్య కృతులు,చలనచిత్ర గీతాలు,యాత్రా కధనాలు,సంగీత నృత్య రూపకాలు,విమర్శనా గ్రంధాలు,అనువాదాలు చేశారు.రోచిస్,సింహేంద్ర పేరుతో కవితలు కూడా రాశారు.సినారె కవిత తొలిసారి జనశక్తి పత్రికలో అచ్చు అయ్యింది.దీనికితోడు ఆయన సినిమా గీతాలు కూడా ప్రాచుర్యం పొందాయి.ఎన్టీఆర్ తో ఆయన బంధం ప్రత్యేకమైంది.1988 లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ అవార్డు అందుకున్నారు.1977 లోనే ఆయన్ను పద్మశ్రీ వరించింది.