Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్లో అయిదు సంవత్సరాల ముందు వరకు బ్రహ్మానందం అంటే స్టార్, ఆయన సినిమాలో ఉంటే చాలు సినిమాలు సక్సెస్ అన్నంతగా బ్రహ్మానందంకు పేరు వచ్చింది. స్టార్ హీరోలు సైతం బ్రహ్మానందంను తమ సినిమాలో నటింపజేసేందుకు ఆసక్తి చూపించేవారు. కాని ప్రస్తుత పరిస్థితి మారిపోయింది. బ్రహ్మానందం తమ సినిమాలో ఉంటే మైనస్ అవుతున్నాడు అనే టాక్ ఉంది. కామెడీ చేయలేక పోతుండగా, ఆయన గతంలో మాదిరిగా సినిమాకు ప్లస్ కాలేక పోతున్నాడు. దాంతో ఇప్పుడు బ్రహ్మానందంకు అవకాశాలే లేకుండా పోయాయి. బ్రహ్మానందం క్రేజ్ పడిపోవడంతో ఆయన స్థానంను భర్తీ చేసేందుకు పలువురు కమెడియన్స్ వస్తున్నారు.
నిన్న మొన్నటి వరకు కమెడియన్ పృథ్వీ తన నటనతో బ్రహ్మానందం స్థానంను భర్తీ చేయగలడని అంతా అనుకున్నారు. కాని ఆయనకు ఆ స్థాయి లేదని తేలిపోయింది. ఒక రకం తరహా కామెడీకే ఆయన పరిమితం అని సినీ వర్గాల వారు అంటున్నారు. ఇక ఇప్పుడు బ్రహ్మానందం వారసుడు వెన్నెల కిషోర్ అంటూ ప్రచారం జరుగుతుంది. బ్రహ్మానందం నుండి కూడా పలు సార్లు ప్రశంసలు అందుకున్న వెన్నెల కిషోర్ ఇటీవల యువ యంగ్ హీరోలకు కామెడీ విషయంలో పెద్ద దిక్కు అయ్యాడు. ప్రతి ఒక హీరో కూడా వెన్నెల కిషోర్‌ను తమ సినిమాలో కోరుకుంటున్నారు. అయితే బ్రహ్మానందం స్థాయిలో వెన్నెల కిషోర్ క్రేజ్‌ను దక్కించుకోలేడు అనేది విశ్లేషకుల వాదన. వెన్నెల కిషోర్ కూడా తనను బ్రహ్మానందంతో పోల్చితే ఒప్పుకోడు.