Posted [relativedate]
మెగా స్టార్ చిరంజీవి సినిమా ఇంద్ర గుర్తుందా ..ఆ సినిమాలో మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్త అనే డైలాగ్ గుర్తుందా..ఆ సినిమాలో ఆ సీన్ లో మొక్కకి అంత ప్రాధాన్యత దక్కింది ..మరి ఇక్కడ కుక్కలకి అంత కంటే ఎక్కువ ప్రధాన్యత దక్కింది ..వాటికోసం కోర్టుకు వెళ్లేంత ప్రేమ దక్కింది అదేంటో మీరే చుడండి..
… కెనడాకి చెందిన ఓ జంటకు సంతానం లేదు. కానీ.. మూడు శునకాల్ని కన్న పిల్లల్లా పెంచుకున్నారు. 16ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత ఇద్దరు విడాకులు తీసుకున్నారు. కానీ.. వీరు పెంచుకుంటున్న శునకాలు ఎవరి దగ్గర ఉండాలన్న ప్రశ్న తలెత్తింది. సాధారణంగా విడాకులు తీసుకున్న దంపతుల పిల్లల సంరక్షణ ఎవరు చూడాలన్న అంశంపై కోర్టు తీర్పునిస్తుంది. ఆ తరహాలోనే వీళ్లు శునకాల నే తమ పిల్లలుగా భావించి కోర్టును ఆశ్రయించారు. కేసు గురించి విన్న కెనడా న్యాయస్థానం శునకాల కోసం కోర్టుకెక్కడమేమిటని ఆశ్చర్యపోయింది. శునకాలు పిల్లలతో సమానం కాదని.. అవి ఎవరి దగ్గరకి వెళ్తే వారి దగ్గర ఉంచుకోవచ్చు… లేదా అమ్మేసుకోమని న్యాయమూర్తులు తమ అభిప్రాయం చెప్పారు. కోర్టు సమయం వృథా చేసినందుకు వారిపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా..పాపం ఆ దంపతులు..