ఓటుకునోటు vs టెలిఫోన్ ట్యాపింగ్…

  cash for vote case vs telephone tapping
దాదాపు 14 నెలల కిందట తెలుగు రాష్ట్రాల్ని కుదిపేసిన ఓటుకునోటు,టెలిఫోన్ ట్యాపింగ్ కేసు మళ్లీ తెరమీదకొస్తున్నాయి.ఏసీబీ కోర్టు ఆదేశం తర్వాత అనుసరించాల్సిన వ్యూహం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టి సారించారు.పోలీసు ఉన్నతాధికారులు,న్యాయ నిపుణులతో ఆయన ఈ అంశంపై మాట్లాడారు.గవర్నర్ నరసింహన్ తో భేటీ సందర్భంగా కూడా ఈ విషయం గురించి చర్చించినట్టు తెలుస్తోంది.తెరాస ఆధ్వర్యంలో నడుస్తున్న నమస్తే తెలంగాణ పత్రికలోనూ ఓటుకునోటు కేసు గురించి వివరించింది.బాబు ని విచారించక తప్పదన్న కోణంలోనే కధనం వచ్చింది.

పైకి ఎలా వున్నా ఈ కేసు విషయంలో బాబు ఆందోళన చెందుతున్నారు.న్యాయనిపుణులతో ఇప్పటికే చర్చించారు.కోర్టు ద్వారానే సమస్యని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారు.తప్పని సరైతే మళ్లీ ఫోన్ ట్యాపింగ్ కేసు దుమ్ము దులిపే అవకాశాలు లేకపోలేదు.టీడీపీ నేత జూపూడి ప్రభాకరరావు హఠాత్తుగా ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావించడం అందులో భాగమేనని తెలుస్తోంది.ఈ పరిస్థితికి కారణమైన వైసీపీ ఈసారి బాబు ఎట్టిపరిస్థితుల్లో తప్పించుకోలేరని అంటోంది .మొత్తానికి పాత కేసులు మళ్లీ కొత్త సంచలనాలకు తెరలేపుతున్నాయి.

SHARE