చంద్రబాబుతో తన ప్రాణాలకి ప్రమాదమంటూ ఓటుకునోటు కేసు నిందితుడు మత్తయ్య ఢిల్లీ ప్రెస్ మీట్ లో చెప్పగానే సాక్షి పండగ చేసుకుంది.ఆయన్ని దొరకబుచ్చుకుని చంద్రబాబు మీద ప్రయోగిద్దామని రెడీ అయిపోయింది.వాళ్ళు అనుకున్నట్టే సాక్షి మైక్ మత్తయ్య నోటి ముందుకి వెళ్ళింది.ఎంత అడిగినా వీళ్ళు కోరుకున్న సమాధానం రాలేదు.ఒక్క రోజులోనే ఆయన టోన్ రివర్స్ అయ్యింది.
సాక్షి ఏమి ప్రశ్నించినా తానేమి చెప్పదలుచుకున్నారో మత్తయ్య అదే చెప్పారు.తనను ఇబ్బంది పెడుతున్న ఓటుకునోటు కేసులో ఇద్దరు ముఖ్యమంత్రులు రాజీ చేసుకుంటే బాగుంటుందని కూడా అయన అభిప్రాయపడ్డారు.ఇంకాస్త ముందుకెళ్లి టీడీపీ వాళ్ళని తెరాస కొనలేదా అని ప్రశ్నించారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో బాబు ముందుకెళ్లలేదని ,కానీ కేసీఆర్ ఓటుకునోటుకేసు లోఅప్పీల్ కెళ్లారని మత్తయ్య చెప్పారు.ఇదంతా మనకెందుకనుకున్న సాక్షి ..చంద్రబాబు మీద చేసిన ఆరోపణల గురించి ఎంత అడిగినా నోరు విప్పలేదు.మరీ ఇబ్బంది పెడితే అసలు విషయాలన్నీ కోర్టులో చెప్తానని తప్పించుకున్నారు .మొత్తానికి ఒక్కరోజులోనే ప్లేట్ తిరగేసి మత్తయ్య సాక్షికి షాక్ ఇచ్చాడు .