ఫ్యూచర్ లో కరెన్సీ నోటు కనిపించదా?

0
256
cashless future

Posted [relativedate]

cashless future
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో పరిస్థితి మారింది. అప్పటి దాకా బ్యాంకు మొహం చూడని వారు కూడా ఒక్క నోటు కోసం క్యూలైన్లో పడిగాపులు కాస్తున్నారు. అంతేకాదు ప్రధాని మోడీ క్యాష్ లెస్ మంత్రి జపిస్తుండడంతో … అంతటా కార్డులదే హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అసలు కరెన్సీ నోటు ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం క్యాష్ లెస్ వ్యవహారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రతిదీ డిజిటలైజ్ జరుగుతోంది. ప్రతి ఒక్కరూ దీన్ని పాటించాలని మోడీ సర్కార్ చెబుతోంది. నల్లధనానికి చెక్ పెట్టాలంటే ఇది తప్పదంటున్నారు కేంద్ర పెద్దలు.

భవిష్యత్తులో పరిమితస్థాయిలో మాత్రమే కరెన్సీ లావాదేవీలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం కరెన్సీ లావాదేవీలపై పరిమితి విధించే అవకాశాలే ఎక్కువ అని విశ్లేషకులు చెబుతున్నారు. 100 శాతం క్యాష్ లెస్ వ్యవహారాలు సాధ్యం కాకపోవచ్చు.. కానీ అందుకోసం ఢిల్లీ పాలకులు మాత్రం గట్టిగానే పట్టుబడుతున్నారు. ప్రజలను ఆదిశగా ఇప్పట్నుంచే ప్రిపేర్ చేస్తున్నారు. అందుకే మోడీయే మళ్లీ అధికారంలోకి వస్తే అసలు నోటు కనిపించకపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు విశ్లేషకులు.

Leave a Reply