కేసీఆర్ కేబినెట్ లో కుల‌ చిచ్చు?

0
280
caste feeling in kcr cabinet

Posted [relativedate]

caste feeling in kcr cabinet
కేసీఆర్ కేబినెట్ లో చిచ్చు రేగిందా? రెడ్డి సామాజిక‌ వ‌ర్గానికి చెందిన మంత్రులు.. ఇత‌ర సామాజిక వ‌ర్గాల మంత్రుల‌కు ప‌డ‌డం లేదా? బ‌ల‌హీన వ‌ర్గాల మంత్రుల పోస్టులు పోతాయ‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌డం వ్యూహంలో భాగ‌మేనా? అంటే ఔన‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

త్వ‌ర‌లోనే కేబినెట్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ జ‌రుగుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కొంద‌రు మంత్రుల‌పై వేటు ప‌డ‌వ‌చ్చ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ లిస్టులో బీసీ వ‌ర్గానికి చెందిన జోగురామ‌న్న‌, ఎస్టీ వ‌ర్గానికి చెందిన‌ చందూలాల్ పై వేటు ప‌డ‌వ‌చ్చ‌న్న ఊహాగానాలు వ‌స్తున్నాయి. ఈ ఊహాగానాల నేప‌థ్యంలో కేబినెట్ లో చిచ్చు రేగింద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఊస్టింగ్ లిస్టులో జోగురామ‌న్న‌, చందూలాల్ పేర్లు వినిపించ‌డం వెన‌క కుట్ర జ‌రుగుతోంద‌ని ఆయా మంత్రులు స‌న్నిహితుల ద‌గ్గ‌ర వాపోతున్నార‌ట‌. ఈ మేర‌కు బీసీ వ‌ర్గానికే చెందిన సీనియ‌ర్ మంత్రి ఈటెల రాజేంద‌ర్ ను క‌లిసి మొర‌పెట్టుకున్నారు. బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు చెందిన మంత్రుల‌పై… ఈర‌క‌మైన ప్ర‌చారం చేయ‌డం వెన‌క రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన మంత్రులున్న‌ట్టు వారు అనుమానిస్తున్నార‌ట‌. ఈ ప్ర‌చారంపై ఈటెల కూడా తోటిమంత్రి కేటీఆర్ తోనూ మాట్లాడిన‌ట్టు టాక్.

నిజానికి ఊస్టింగ్ రేసులో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, నాయిని న‌ర్సింహారెడ్డి, మహేంద‌ర్ రెడ్డి, ల‌క్ష్మారెడ్డి పేర్లు కూడా మొద‌ట‌ వినిపించాయి. కొన్ని రోజులుగా ఎందుక‌నో ఆ ప్ర‌చారం త‌గ్గిపోయింది. కానీ జోగురామ‌న్న‌, చందూలాల్ పై మాత్రం జోరుగా ఊహాగానాలు వ‌స్తున్నాయి. ఇదంతా ఒక వ్యూహం ప్ర‌కార‌మే జ‌రుగుతోంద‌న్న అనుమానాలు వ్య‌క్తమ‌వుతున్నాయి.

ప‌ని గ‌ట్టుకొని కొంద‌రు మంత్రుల‌ను ఊస్టింగ్ లిస్టులో చేర్చ‌డం… అందులో బ‌ల‌హీన వ‌ర్గాల పేర్లే వినిపించ‌డం స‌రికాద‌ని ఈటెల కూడా కొంత అసంతృప్తిగా ఉన్నార‌ట‌. ఇలా అయితే బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల్లో పార్టీకున్న ఇమేజ్ త‌గ్గిపోతుంద‌ని మంత్రి కేటీఆర్ కు వివ‌రించార‌ట ఈటెల‌. దానికి కేటీఆర్ కూడా ఇలాంటి ప్ర‌చారాలు న‌మ్మవ‌ద్ద‌ని కోరార‌ట. దీంతో ప్ర‌స్తుతానికి ఈ వ్యవ‌హారం చ‌ల్లారిన‌ట్టేన‌ని టాక్.

కుల‌చిచ్చు విష‌యం సీఎం కేసీఆర్ దృష్టికి కూడా వెళ్లింద‌ట‌. ఎవ‌రెన్ని ప్ర‌చారాలు చేసినా అంతిమ నిర్ణ‌యం త‌న‌దే కాబ‌ట్టి.. ఎలాంటి అనుమానాలు పెట్టుకోవ‌ద్ద‌ని జోగురామ‌న్న‌, చందూలాల్ కు కేసీఆర్ భ‌రోసా ఇచ్చార‌ట‌. స్వ‌యంగా కేసీఆరే చెప్పిన‌ప్ప‌టికీ… నిప్పు లేనిదే పొగ‌రాదుగా? అన్న సామెత ఉండ‌నే ఉందిగా!!!.

Leave a Reply