జయ పోయాక అన్నాడీఎంకే లో కులవాసనలు…

0
219
castefeeling in annadmk

Posted [relativedate]

castefeeling in annadmk
ఓ మహా వృక్షం కూలిపోయాక ఏమి జరుగుతుందో ప్రస్తుత తమిళనాడు రాజకీయాల్ని చూస్తే అర్ధం అవుతుంది.బ్రాహ్మణ వ్యతిరేక …ద్రావిడ భావాలకు అనుకూలంగా పుట్టిన పార్టీ అన్నాడీఎంకే. అయినా అయ్యంగార్ బ్రాహ్మిణ్ గా పుట్టిన జయ ఆ పార్టీ లో ఎదిగారు..ముఖ్యమంత్రి అయ్యారు.పార్టీలో తనకు తిరుగులేదనిపించుకున్నారు.కానీ ఆమె మరణం తర్వాత వారసత్వ పోటీలో భాగంగా కుల ప్రస్తావన మళ్లీ తెర మీదకొస్తోంది.పార్టీ బాధ్యతలు చూస్తున్న శశికళ, ప్రభుత్వ పగ్గాలు పట్టుకున్న పన్నీర్ సెల్వం ఇద్దరు దేవర్ కులానికి చెందిన వాళ్ళే …అయితే ఇద్దరి ఉపకులాలు మాత్రం వేరు. అన్నాడీఎంకే కి అండగా వుంటూ వస్తున్న కులానికి చెందిన వాళ్ళే ఈ ఇద్దరు కావడంతో ఏ చిక్కు లేదని అంతా భావించారు.అయితే అక్కడే తేడా జరిగింది.ఒకే కులానికి రెండు కీలక పదవులు దక్కడమేంటన్న చర్చ మొదలైంది.

అన్నాడీఎంకే కి అండగా ఉంటున్న మరి కొన్ని కులాల నేతలు జయ మరణం తర్వాత కుల ప్రస్తావన తెస్తున్నారు.ముఖ్యంగా నాడార్ నేతలు కొందరు శశికళ కి వ్యతిరేకంగా గళమెత్తిన జయ మేనకోడలు దీప కి మద్దతుగా బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.దీని వల్ల పార్టీలో ఇప్పటికిపుడు వచ్చిన నష్టం ఏమీ లేదు.శశికళకి వ్యతిరేకంగా పోరాటం చేసేంత శక్తి ఈ నేతలకి లేదు కూడా. అయినా జయ వున్నప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయంటే అది చిన్న విషయం కాదు. అది కూడా భావోద్వేగాలకు పెద్ద పీట వేసే జనమున్న తమిళనాట ఒక్క సారి కుల చిచ్చు రగులుకుంటే అది ఒక్క అన్నాడీఎంకే పార్టీతో పోదు.మొత్తం తమిళ సమాజాన్నే కుదిపేస్తోంది.ఈ ప్రమాదాన్ని గుర్తెరిగి వ్యవహరించకపోతే పన్నీర్, శశికళకి తిప్పలు తప్పవు.

Leave a Reply