మెగా డాటర్ తో ఫైట్.. కేథరిన్ ఔట్ !

Posted October 14, 2016

 chiranjeevi daughter sushmita hurt catherine out from khaidi number 150 movie

కొన్నాళ్లుగా మెగా ఐటమ్ గా ఫేమస్ అయిపోయింది కేథరిన్. ఈ ఆఫర్ తో కేథరిన్ గ్రాఫ్ మారిపోవడం ఖాయమనే ప్రచారం జరిగింది. కేథరిన్ కూడా మెగాస్టార్
ప్రక్కన ఎప్పుడెప్పుడూ చిందులేద్దామని ఆసక్తిగా ఎదురు చూసింది. ఆ టైం రానే వచ్చింది.  తీరా ఫస్ట్ డే ఐటమ్ సాంగ్ షూటింగ్ తోనే కేథిరిన్ మెగా ప్రాజెక్ట్ నుంచి ఔట్ అయ్యింది.

ఇందుకు కారణం కొరియోగ్రాఫర్ లారెన్స్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. లారెన్స్ సూచించిన డ్రెస్ లని వేసుకొనేందుకు కేథరిన్ అభ్యంతరం చెప్పిందని
చెప్పుకొచ్చారు. అయితే, అసలు కారణం ఇది కాదట. మెగా డాటర్ తో గొడవనే కేథరిన్ కొంపముంచినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ ఖైదీ నెం.150 చిత్రానికి
చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కాస్టూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. ఓ విషయంలో సుస్మితని కేథరిన్ హర్ట్ చేసిందట. దీంతో.. సుస్మిత రాంచరణ్ కి
ఫిర్యాదు చేయడం.. చెర్రీ వెంటనే కేథరిన్ కి రెడ్ కార్డ్ ఇచ్చేయడం చక చకా జరిగిపోయాట. ఇప్పుడు ఈమె స్థానంలోకి పవన్ ఐటమ్ లక్ష్మీరాయ్ వచ్చేసింది.

SHARE