నల్ల డబ్బు కేసులో శేఖర్ రెడ్డి అరెస్ట్ ..

Posted December 21, 2016

CBI Arrested to TTD Board Member Sekhar Reddy
టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనతో పాటు సోదరుడిని, ఆడిటర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. చెన్నై సీబీఐ కోర్టు వీరికి జనవరి 3వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది.శేఖర్‌రెడ్డి సహా అయన స్నేహితుల ఇళ్ల పై ఆదాయపు పన్నుశాఖ అధికారులు చెన్నై లో ఇటీవల దాడులు చేసి మొత్తం రూ. 106.52 కోట్ల నగదు, రూ. 36.29 కోట్ల విలువ చేసే 127 కిలోల బంగారం, అనేక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకొన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో పెద్ద మొత్తంలో దొరికిన సొమ్ము ఇదేనని ఆదాయపన్నుశాఖ వెల్లడించింది. కేసు అనంతర పరిణామాల వల్ల శేఖర్‌ రెడ్డిని టీటీడీ బోర్డు సభ్యత్వం నుంచి తొలగించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే సెక్షన్‌ కింద శేఖర్‌రెడ్డి సహా నలుగురిపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు కేసు నమోదు చేశారు. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్‌ రామ్మోహన్‌ రావు కొడుకుతో శేఖర్‌ రెడ్డికి సంబంధాలున్నాయనే ఆరోపణలు వచ్చాయి.సి ఎస్ ఇంట్లో కూడా ఐటీ దాడులు చేసింది..

[wpdevart_youtube]EBUDfNks31I[/wpdevart_youtube]

SHARE