దేశం నేతలపై ఐటీ రిహార్సల్..ఫ్యూచర్ పై వైసీపీలో టెర్రర్

0
371

Posted [relativedate]

  cbi ride tdp mla modugula venugopala reddy

cbi-rideనల్ల ధనం వెకిలికితీతపై కేంద్రం దృష్టి సారించగానే ఏపీ లో ఆ ప్రకంపనల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.ఐటీ దాడులు పెరిగాయి.తాజాగా దేశం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరిపారు.బెంగళూరు లో అయన నిర్వహిస్తున్న కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థల లావాదేవీల్లో అవకతవకలు గుర్తించినట్టు ప్రాధమిక సమాచారం.

ఇటీవల జరుగుతున్న ఐటీ దాడుల్ని పరిశీలిస్తే తెలుగుదేశానికి సంబంధించిన వారిపైనే ఫోకస్ పెట్టినట్టు కనపడుతోంది.చిత్తూరు ఎమ్మెల్యే,డీకే ఆదికేశవులు సతీమణి సత్య ప్రభ వ్యాపార లావాదేవీలు …తరువాత బాలకృష్ణ సన్నిహితుడు ,నిర్మాత సాయి కొర్రపాటి తదితరుల మీద ఐటీ దాడులు జరిగాయి.ఇప్పుడు మోదుగుల.

మొత్తంగా దేశం అనుకూలురు అయిన వాళ్ళ మీదే ఐటీ శాఖ ఇప్పటిదాకా దృష్టి పెట్టింది .అధికార పార్టీ వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.అదేమిటని ప్రశ్నిస్తే వైసీపీ సీనియర్ నేత ఒకరు భలే మాట చెప్పారు.ఐటీ శాఖ అధికార పార్టీ మీదే ఇంత ఘాటు రిహార్సల్ వేస్తోంటే రాజకీయ ప్రత్యర్థులపై ఏ స్థాయిలో ఉంటుందో తలచుకుంటేనే టెర్రర్ పుడుతోందంటున్నారు ఆ పెద్దాయన .పైగా భవిష్యత్ లో రాజకీయ వేధింపులు అన్న విమర్శ రాకుండా ఉండేందుకే ప్రస్తుతం అటు టార్గెట్ చేశారని అయన డౌట్ .ఆ పెద్ద మనిషి విశ్లేషణ నిజమవుతుందో లేదో చూద్దాం.

Leave a Reply