వామ్మో హౌరా బోగీ నిండా నల్లధనం..సిబిఐ రైడ్

0
757
CBI search in special coach derails top railway security officer travel

Posted [relativedate]

CBI search in special coach derails top railway security officer travel
దేశ ఆర్ధిక వ్యవస్థలో లోపాలకి ఈ ఘటన నిలువుటద్దం. ప్రభుత్వాలే కొత్త నోట్ల తరలింపుకు విమానాలు వాడుతుంటే …అక్రమార్కులు ఏకంగా ఓ స్పెషల్ బోగీ లో నల్లధనాన్ని గుట్టు చప్పుడు కాకుండా తరలించేందుకు ప్లాన్ వేశారు.కాకపోతే అది ఫెయిల్ అయ్యి ఆ బోగీ తో సహా సిబిఐ అధికారులకి పట్టుబడ్డారు.మొన్న తమిళనాడులో జరిగిన ఈ వ్యవహారం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.దీనికి సంబందించిన వివరాలివి ..

తిరుచ్చి నుంచి చెన్నై వెళ్లే హౌరా ఎక్స్ ప్రెస్ లో రైల్వే భద్రతా విభాగానికి చెందిన ఐజీ స్థాయి అధికారి పారి స్పెషల్ బోగీ బుక్ చేసుకున్నారు.భువనేశ్వర్ కి చెందిన ఈ అధికారి పెద్ద ఎత్తున డబ్బు,బంగారం ఆ బోగీలో తరలిస్తున్నట్టు సిబిఐ కి సమాచారం అందింది. దీంతో ఎగ్మోర్ స్టేషన్ లో రైలు ఆపిన అధికారులు ఆ బోగీలోకి వెళ్లి చూసి అక్కడున్న డబ్బు ,బంగారం చూసి నోరు వెళ్ళబెట్టారు.సదరు అధికారిని,బోగీని అదుపులోకి తీసుకుని హౌరాని పంపించేశారు.ఎవరైనా బ్లాక్ కోబ్రా తరపున అయన ఈ పని చేశారా లేక రైల్వే ఉన్నతాధికారుల డబ్బుని తరలిస్తున్నారా అనేది తేలాల్సి వుంది.

Leave a Reply