Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశమంతా ఒక్కటే రాజకీయ వాతావరణం.బీజేపీ ని కాదంటే ఎటు వైపు నుంచి ఐటీ దాడులు జరుగుతాయో …ఎటు వైపు నుంచి ఈడీ కమ్ముకొస్తుందో..ఏ పక్క నుంచి కేసులు చుట్టుముడతాయో అని పార్టీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్కడు ఎదురు తిరిగాడు. సాక్షాత్తు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ని క్షమాపణ చెప్పాలని తెలంగాణ నడిబొడ్డు నుంచి డిమాండ్ చేసాడు.దీంతో షా అహం దెబ్బతినే ఉంటుంది.అదే జరిగితే తెలంగాణ అనే కవచంలో హాయిగా వున్న కెసిఆర్ ని బీజేపీ ఎలా దెబ్బ తీస్తుందన్న సందేహాలు వచ్చాయి.ఆ టైం లో బీజేపీ నాయకుడు ఒకరు కెసిఆర్ గతాన్ని తవ్వి ఓ అస్త్రాన్ని అమిత్ షా చేతికి అందించారట.ఆ విషయాలు ఏంటో చూద్దామా?
కెసిఆర్ 2006 లో కేంద్ర కార్మిక శాఖా మంత్రిగా పనిచేసినప్పుడు ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి.కెసిఆర్ కేంద్రమంత్రిగా చేసిన ఓ సంతకం వల్ల 11 లక్షల మంది ఉద్యోగులు నష్టపోయినట్టు ఆరోపణలు వచ్చాయి.epf అధికారులు సహారా గ్రూప్ లో చేసిన తనిఖీల్లో ఈ విషయం బయటికొచ్చింది. సహారా ఇండియా పరివార్ లోని ఐదు కంపెనీలకు సంబంధించిన ఖాతాలను తామే నిర్వహించుకుంటామని సహారా గ్రూప్ కేంద్రాన్ని అనుమతి కోరింది. EPF అభ్యంతరాల్ని కూడా పట్టించుకోకుండా అప్పటి కార్మిక శాఖ మంత్రి కెసిఆర్ అందుకు అనుమతి ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి.ఆ తరువాత రెండున్నర నెలలకే కెసిఆర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కార్మిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆస్కార్ ఫెర్నాండేజ్ ఆ వ్యవహారం మీద సమగ్ర విచారణకు అంగీకరించినా అదేమీ ముందుకు కదల్లేదు.అప్పట్లో కెసిఆర్ కి ఓఎస్డీ గా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ సీఎంఓ లో ప్రత్యేక కార్యదర్శి హోదాలో పని చేస్తున్నారు.ఈ వ్యవహారాన్ని తిరగదోడి కెసిఆర్ మీదకి సిబిఐ ని ఉసిగొల్పాలని సదరు బీజేపీ నాయకుడు అమిత్ షా వద్ద ఉదరగొట్టాడట. అమిత్ షా,బీజేపీ అధిష్టానం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటే కెసిఆర్ మీద సిబిఐ కన్ను పడటం ఖాయం.