అవి కామపు ముద్దులు కాదా ?

Posted November 21, 2016

censor board approved of befikre movie lip lock kiss scenesఒకప్పుడు ఒక్క ముద్దు సీన్ ఉన్న సినిమా కు బోలెడు కట్లు చెప్పిన సెన్సె బోర్డు ఛైర్మెన్ పహ్లాజ్‌ నిహ్లాన భారతీయ సంస్కృతి, సంప్రదాయం అని చెప్పి తన చర్యను సమర్థించుకున్నాడు. ఆ తర్వాత పంజాబ్‌లోని విష సంస్కృతి నేపథ్యంలో తెరకెక్కిన ‘ఉడ్తాపంజాబ్‌’ను ముప్పుతిప్పలు పెట్టాడు. ఆ సమయంలో సెన్సార్‌ తీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.

తాజా గా 23 ముద్దు సీన్లు ఉన్న ‘బేఫికర్‌’ సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చి మరోసారి సంచలనం సృష్టించాడు. నిజానికి, ఈయన సినిమాలు తీసినపుడు వాటి నిండా శృంగార దృశ్యాలే ఉండేవి. కానీ, సీబీఎఫ్సీ చైర్మన్‌ అయిపోయాక హఠాత్తుగా మారిపోయాడు. అందుకే సినిమాల్లో అశ్లీలాన్ని, అసభ్యతను అంగీకరించనని చెప్పేవాడు. అలాంటిది యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌లో తెరకెక్కిన ‘బేఫికర్‌’ పట్ల నిహ్లానీ ఇంత ఉదారంగా ఎందుకు ఉన్నాడని జాతీయ మీడియా ప్రశ్న .

‘బేఫికర్‌’కు యూ/ఎ ఎందుకు ఇచ్చారు అన్న ప్రశ్నకు ఓ విచిత్రమైన సంబంధం చెప్పాడు నిహ్లానీ. ‘ఆ ముద్దు సీన్లు చాలా అర్థవంతంగా ఉన్నాయి. అవి శృంగారానికి సంబంధించిన ముద్దులు కావు. ప్రేమను వ్యక్తపరిచే ముద్దులు అని .

[wpdevart_youtube]DGuvF5t2Wzc[/wpdevart_youtube]

SHARE