వాట్ టు డు వర్మ..??

0
498
censor board says who you direct biopic movie bring no objection letter from their family

Posted [relativedate]

censor board says who you direct biopic movie bring no objection letter from their familyఇటీవల సినీ పరిశ్రమలో సరికొత్త కధలు కరువయ్యాయన్నది నగ్న సత్యం. కొత్త కధలను క్రియేట్ చేయలేక ఒకవేళ చేసినా జనాలకు నచ్చకపోతే లాభాలు గూబల్లోకి దిగుతుండడంతో దర్శకనిర్మాతలు కూడా బయోపిక్ లపై పడ్డారు. ఇంకొకరి జీవితంపై మనుషులకి సహజంగా ఆసక్తి ఉండడంతో ఆ బయోపిక్స్ కూడా మినిమమ్ గ్యారెంటీగా నిలుస్తున్నాయి. కొన్ని బయోపిక్స్ అయితే బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి.  అయితే తాజాగా సెన్సార్ బోర్డు ఈ బయోపిక్స్ రూపొందించే వారికి షాకింగ్ న్యూస్ చెప్పింది. బయోపిక్స్‌ పై వివాదాలు పెరిగిపోవడంతో,  అలాంటి కథలతో తెరకెక్కే సినిమాల ట్రైలర్ రిలీజ్‌ కు ముందే సంబంధిత వ్యక్తుల నుంచి నో అబ్జెక్షన్ కంపల్సరీ తీసుకోవాలని  సెన్సార్ బోర్డు ప్రకటించింది.

కాగా ఈ బయోపిక్స్ తీయడానికి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా మినహాయింపు కాదు. బయోపిక్స్ లో కూడా కాంట్రవర్సీ బయోపిక్స్ ను ఎంచుకోవడం వర్మ స్టైల్ అని చెప్పుకోవచ్చు. రక్త చరిత్ర, వంగవీటి, వీరప్పన్ లాంటి కాంట్రవర్సీ బయోపిక్స్ వర్మ దర్శకత్వం నుండి జాలు వారినవే. అయితే ఈ బయోపిక్స్ లో కాంట్రవర్సీ సన్నివేశాలను వర్మ టచ్ చేయకుండా లైటర్ వీన్ లో కధ నడింపించేశాడని చెప్పుకోవచ్చు.

కాగా సెన్సార్ బోర్డు నిర్ణయంతో  తాజాగా వర్మ రూపొందిస్తున్న సర్కార్-3 సినిమాపై పలు అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. అమితాబ్ ప్రధాన పాత్రలో వర్మ తెరకెక్కిస్తున్న ‘సర్కార్ 3’ సినిమా కథ ముంబైలోని శివసేన మాజీ చీఫ్ బాల్ థాక్రేదే అన్న సంగతి ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవ్వాలంటే థాక్రే ఫ్యామిలీకి చెందిన ఉద్ధవ్ థాక్రే గానీ, రాజ్ థాక్రే గానీ  గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. గతంలో సర్కార్  సినిమాపై వీరి ఫ్యామిలీ నుంచి కొంత అభ్యంతరాలు వెలువడ్డాయి.  మరి ఈ సారి ‘సర్కార్ 3’ కి వాళ్లు  నో అబ్జెక్షన్ ఇస్తారా లేదా  అని అభిమానులతో పాటు చిత్ర యూనిట్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మొత్తానికి సెన్సార్ బోర్డు నిర్ణయంతో వర్మ… తన సినిమాకు నో అబ్జెక్షన్ తెస్తాడా, సినిమా రిలీజ్ చేస్తాడా లేదా చూడాలి.

Leave a Reply