కేంద్రానికి తమిళనాడు విసురుతున్న సవాల్.?

Posted December 6, 2016

central government get headaches to controlling tamil nadu law and orderతమిళనాడు పరిణామాలు కేంద్రానికి తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్య సమస్య పూర్తిగా ప్రకృతి సహజసిద్దమైందే. అందుకు ఏ ఒక్కరు బాధ్యులు కారు. అయినప్పటికి ఆమె అభిమానులు దీన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. వార్ని కట్టడి చేయడం కేంద్రానికూడా తలకుమించిన భారంగా పరిణమించింది. వారెవరిపైనా దాడులు చేసే పరిస్థితి లేదు. అలాగే ప్రభుత్వాస్తుల దహనానికి కూడా పాల్పడరు. కానీ ఎవరికి వారు తమనుతాము శిక్షించుకునే ప్రమాదముంది. ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు తమిళనాట స్పష్టంగా ఉన్నాయి. దీన్నుంచి వార్ని కాపాడ్డమే కేంద్రానికి తలనొప్పిగా మారబోతోంది. అనుకోని పరిణామాలు సంభవిస్తే పదిరోజులకు పైగా తమిళనాడు స్తంభించే అవకాశముంది.

jayalalitha passed awayఈ సమయంలో ప్రజాజీవనాన్ని పరిరక్షించడంతో పాటు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రంపైనే ఉంటుంది. తిరిగి రాష్ట్రంలో సానుకూల పరిస్థితులేర్పడేవరకు తిరిగి కేంద్రమే బాధ్యత తీసుకోవాల్సుంటుంది. ఈ లోగా ప్రజల్లో నెలకొనే అనిశ్చితిని సమర్ధవంతంగా కట్టడి చేయాల్సుంటుంది. ఇందుకోసం రెండుమూడ్రోజుల నుంచే కేంద్రం పలు రకాల ప్రయత్నాలు మొదలెట్టింది. ఇప్పటికే తమిళనాడు సరిహద్దుల్ని మూసేశారు. ఇతర ప్రాంతాల్నుంచి రాకపోకల్ని నిషేధించారు. ఈపాటికే లక్షలాదిమంది చెన్నైలోకొచ్చేశారు. అమ్మ దర్శనం కోసం కోటిమందికిపైగా ఏదో రూపంలో నగరంలోకొచ్చేస్తారన్న నిఘా వర్గాల సమాచారం కేంద్రాన్ని కూడా భయబ్రాంతులకు గురి చేస్తోంది. వీరందర్నీ కట్టడి చేయడం ఖచ్చితంగా పెనుసవాలే.

SHARE