ప‌ళ‌నిస్వామిపై కేంద్రం నిఘా?

0
215
central government had an eye on palanisamy

Posted [relativedate]

central government had an eye on palanisamy
త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామిపై కేంద్రం క‌న్నేసిందా? ఆయ‌న‌పై నిఘా ఉంచారా? ప‌ళ‌నిస్వామి సీఎం కుర్చీ గ‌ల్లంత‌య్యే అవ‌కాశ‌ముందా? అంటే ఏమైనా జ‌ర‌గొచ్చ‌న్న వాద‌న వినిపిస్తోంది.

నిజానికి త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామి గురించి కేంద్ర వైఖ‌రి ఇప్ప‌టిదాకా బ‌య‌ట‌ప‌డ‌లేదు. అయితే తొలిసారిగా కేంద్ర‌మంత్రి పొన్ రాధాకృష్ణ‌న్ ఆయ‌న‌పై స్పందించారు. దివంగత జయలలిత కూర్చొన్న కుర్చీలో కూర్చొన్నావు.. ఇకపై ఆ పదవిలో ఎక్కువ రోజులు ఉండలేవంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పళనిస్వామి కూర్చొన్న కుర్చీ అద్దె కుర్చి. అందులో ఎక్కువ కాలం ఉండలేవంటూ కామెంట్ చేశారు.

కేంద్ర‌మంత్రి రాధాకృష్ణ‌న్ వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. ఢిల్లీ పెద్ద‌లు ప‌ళ‌నిస్వామిపై క‌న్నేసిన‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే ప‌ళ‌నిపై గ‌తంలో ఏమైనా కేసులున్నాయా అని ఆరా తీశార‌ట‌. అంతేకాదు పెద్ద నోట్ల కేసులో ఆయ‌న పాత్ర‌పై అప్ప‌ట్లో ఊహాగానాలొచ్చాయి. పెద్ద నోట్ల కేసులో ప‌ట్టుబ‌డిన శేఖ‌ర్ రెడ్డితో … ప‌ళ‌నిస్వామి వియ్యంకుడికి స‌న్నిహిత సంబంధాలున్నాయి. దీంతో ఆ కేసు ఈయ‌న మెడ‌కు ఎక్క‌డ చిక్కుకుంటుందోన‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అంతేకాదు కొంత‌కాలం గ్యాప్ ఇచ్చి… ఆ కేసును తిర‌గదోడే అవకాశం ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. అదే జ‌రిగితే ప‌ళ‌నిస్వామికి క‌ష్టాలు త‌ప్ప‌వు. ఇదే పాయింట్ ఆధారంగా కూపీ లాగుతున్నార‌ట ఢిల్లీ పెద్ద‌లు.

ఇప్ప‌టికే ప‌ళ‌నిస్వామి వియ్యంకుడిపై అధికారుల క‌న్ను ఉంది. శేఖ‌ర్ రెడ్డితో సంబంధాల‌పై ఆరా తీస్తున్నారు. ఈలింకులు ప‌ళ‌నిస్వామి దాకా రావొచ్చ‌న్న అనుమానం వ్య‌క్త‌మ‌వుతోంది. అదే జ‌రిగితే సీఎం ప‌ళ‌నిస్వామికి చిక్కులు త‌ప్ప‌వు. సీఎం కుర్చీ గ‌ల్లంతు కావ‌డంతో పాటు జైలుకెళ్లినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు.

ఢిల్లీ పెద్ద‌ల ఆలోచ‌న వేరే ర‌కంగా ఉంద‌ని ప‌ళ‌నిస్వామికి కూడా అర్థ‌మైంద‌ట‌. అందుకే ఆయ‌న వ‌ర్గం కొన్ని జాగ్ర‌త్తలు తీసుకుంటోంద‌ట‌. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా… ఢిల్లీ త‌లుచుకుంటే ఏమైనా జ‌ర‌గొచ్చంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

Leave a Reply