బడ్జెట్ బొక్కలపై నీతిఆయోగ్ కన్ను

 central govt bill passed neethi ayag budget billరాష్ట్ర ప్రభుత్వాల భారీ బడ్జెట్ల బాగోతం వచ్చే ఏడాది నుంచి బయటపడనుంది. ఒక్కో పథకానికి ఇన్ని కోట్లు కేటాయించామని రాష్ట్రాల ఆర్థికమంత్రులు చెప్పుకునే గొప్పలు ఇక కుదరవు. లెక్కలన్నీ విడదీసి చెప్పాల్సిందే. కేటాయింపుల్లో కేంద్రం ఇచ్చిన నిధులెన్నీ..? రాష్ట్రం సమకూర్చిన నిధులెన్నీ..? అనేది డీటెయిల్డ్ గా వివరించాలని కేంద్ర ప్రభుత్వం ఆర్డర్స్ ఇష్యూ చేసింది.బడ్జెట్ కేటాయింపులు, బడ్జెట్ స్వరూపంలో మార్పులకు సంబంధించి నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాలకు గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. వచ్చే ఏడాది నుంచి జీఎస్టీ చట్టం అమల్లోకి రానుంది. దీంతో ఈ ఆర్డర్స్ కీలకంగా మారాయి.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల స్కాలర్ షిప్ లకు, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పింఛన్లకు నిధులు అందిస్తోంది. విద్య, వైద్య ఆరోగ్యం, సాగునీరు, పౌష్టికాహారం, అంగన్ వాడీ కేంద్రాలతోపాటు మరెన్నో కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తోంది. అలాగే ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గ్రాంట్లు ఇస్తోంది. అయితే, కొన్ని రాష్ట్రాలు కేంద్రం ఇస్తున్న నిధులకు మరికొంత డబ్బు కలిపి కార్యక్రమాలకు బడ్జెట్ లో నిధులు కేటాయిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల నిధుల్లో ఎక్కువభాగం కేంద్రానివే అయినా క్రెడిట్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే దక్కుతోంది. దీంతో ఈ విధానాన్ని మార్చాలని మోడీ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.

దీంట్లో భాగంగానే నీతి ఆయోగ్ గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది.ఇకపై కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్ లో తప్పనిసరిగా చూపించాలి. కేంద్ర మంత్రిత్వ శాఖలు రాష్ట్రాలకు ఏ కార్యక్రమానికి ఎన్ని నిధులను కేటాయించాయనే వివరాలను రాష్ట్రాల బడ్జెట్ లో చూపాలని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ఇలా చేయడంవల్ల పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులెన్ని, రాష్ట్ర సర్కారు ఇస్తున్న నిధులెన్నో బడ్జెట్ ల ద్వారా ఈజీగా తెలిసిపోనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది.

SHARE