ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకహోదా దాదాపుగా లేనట్టేనని కేంద్రం చాలాసార్లు సంకేతాలు పంపింది. ఇప్పుడు అలాంటిదే మరో ఘటన. విజయవాడ వచ్చిన కేంద్రమంత్రి జవదేకర్ పుష్కర స్నానం చేశారు. ఏర్పాట్లు భలే ఉన్నాయని ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పధంలో నడుస్తుందని అయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ని అన్నివిధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అప్పటిదాకా పరమవుత్సాహంగా మాట్లాడిన అయన ప్రత్యేక హోదా విషయం వచ్చేసరికి ఆయన మౌనందాల్చారు .ఆ మౌనం వెనుకున్న అర్ధమేంటో ప్రత్యేకంగా చెప్పాలా?