మెగాస్టార్ పై ప‌గ‌బ‌ట్టిన టీటీడీ ఛైర్మ‌న్!!

0
417
chadalavada krishnamurthy grudge on chiranjeevi

Posted [relativedate]

chadalavada krishnamurthy grudge on chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి ఖైదీనెంబ‌ర్-150 తో షేక్ చేస్తున్నారు. థియేట‌ర్ల‌న్నీ హౌస్ ఫుల్ బోర్డుల‌తో క‌ళ‌క‌ళలాడుతున్నాయి. థియేట‌ర్ల బ‌య‌ట చిరంజీవి వాల్ పోస్ట‌ర్లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. చిరంజీవికి సంబంధించిన భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. మ‌రి ఈ సంద‌ర్భంలో టీటీడీ ఛైర్మ‌న్ చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి.. చిరంజీవిపై ఎందుకు ప‌గ‌బ‌ట్టిన‌ట్టు? అనే క‌దా మీ డౌటు అస‌లు ఆయ‌న ఎందుకు ప‌గ‌బ‌ట్టాల్సి వ‌చ్చింది? ఆ డీటైల్స్ తెలుసుకుందాం.

చదలవాడ కృష్ణమూర్తి. ఈయ‌న గ‌తంలో ఎమ్మెల్యేగాను పనిచేశారు. ప్ర‌స్తుతం టీటీడీ ఛైర్మ‌న్ గాను వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తిరుప‌తిలో చ‌ద‌ల‌వాడ మాటే వేదం. నగరంలో పార్టీ కార్యక్రమాలన్నీ ఈయ‌న చెప్పిన‌ట్టే జరుగుతాయి. ఇదంతా ప‌క్క‌న బెడితే సారుకు థియేట‌ర్లు కూడా ఉన్నాయి. తిరుప‌తిలో ఖైదీ సినిమా న‌డుస్తున్న 8 థియేట‌ర్ల‌లో 4 చ‌ద‌ల‌వాడవేన‌ని టాక్.

సినిమా .. రాజ‌కీయం… వేరు వేరు… అయిన‌ప్ప‌టికీ చ‌ద‌లవాడ మాత్రం రెంటినీ ఒకేలా చూస్తున్న‌ట్టుంది. అందులో భాగంగా త‌న థియేట‌ర్ల‌లో చిరంజీవి సినిమా న‌డుస్తున్నా… బ‌య‌ట మాత్రం ఆ హ‌డావుడి లేకుండా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఖైదీ నెంబ‌ర్ 150 న‌డుస్తున్న ఏ థియేట‌ర్ లోనూ బ‌య‌ట చిరుకు సంబంధించిన ఒక్క పోస్ట‌ర్ కానీ, క‌టౌట్ కానీ.. ఫ్లెక్సీ కానీ లేదు. అస‌లు సినిమా ఉందా… లేదా అన్న‌ట్టుగా ఉంది ప‌రిస్థితి. సినిమా చూసే వాళ్లు ముందే బుక్ చేసుకొని వ‌స్తున్నారు.. పోతున్నారు..లోప‌ల సినిమా కుమ్మేస్తుంటే బ‌య‌ట మాత్రం ఒక్క క‌టౌట్ పెట్ట‌క‌పోవ‌డంపై చిరు అభిమానులు చాలా అసంతృప్తితో ఉన్నార‌ట‌. దీనిపై థియేట‌ర్ల సిబ్బందిని ప్ర‌శ్నిస్తే…. త‌మకేం తెలియ‌ద‌ని చెప్పుకొస్తున్నార‌ట‌.

చ‌ద‌ల‌వాడ ఆదేశాల మేర‌కే థియేట‌ర్ల‌లో చిరుకు సంబంధించిన క‌టౌట్లు క‌నిపించ‌డం లేదంటున్నారు మెగాస్టార్ అభిమానులు. టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి రెన్యువ‌ల్ కోసం ఇంత‌కు దిగ‌జారారా… అన్న అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. టీడీపీ పెద్ద‌ల క‌రుణ కోసం మెగాస్టార్ పై కోపం పెంచుకోవ‌డం స‌రికాదనే మాట వినిపిస్తోంది. సినిమాను రాజ‌కీయంతో ముడిపెట్ట‌డం ఎంత‌వ‌ర‌కు కరెక్టో .. మ‌రి చ‌ద‌ల‌వాడే స‌మాధానం చెప్పాలి.

చ‌ద‌లవాడ క‌టౌట్ రాజ‌కీయం టీడీపీ పెద్ద‌ల దాకా వెళ్ల‌లేదు. వెళ్తే మాత్రం ఆయ‌న‌కు క‌చ్చితంగా అక్షింత‌లు ఖాయ‌మంటున్నారు టీడీపీ శ్రేణులు. మ‌రీ ఇంత ఓవ‌ర్ గా ప్ర‌వ‌ర్తించ‌డం స‌బ‌బు కాద‌ని టీడీపీ నాయ‌కులే చెబుతున్నారు.

Leave a Reply