క్రేజీ కాంబినేషన్లో చైతూ

Posted February 17, 2017

chaitu in crazy combinationప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో సినిమాలతో నటనపరంగా నాగచైతన్య ఓ మెట్టు ఎక్కాడనే చెప్పాలి. దీంతో టాప్ డైరెక్టర్స్ కూడా చైతూతో మూవీని చేసేందుకు క్యూ కడుతున్నారు. అయితే కధలను ఎంచుకునే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు చైతూ. రీసెంట్ గా సోగ్గాడే చిన్ని నాయనా సినిమాను తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణతో ఓ సినిమాను స్టార్ట్ చేశాడు. దీనితో పాటుగా మరో సినిమాకి కూడా కమిట్ అయ్యాడట ఈ అక్కినేని వారసుడు.

తమిళంలో ‘ధృవంగల్ పదినారు’ సినిమాను తెరకెక్కించి సంచలన డైరెక్టర్ గా మారిన కార్తీక్ నరేన్ తాజాగా ఓ ద్విభాషా చిత్రాన్ని  ప్లాన్ చేశాడు. ‘ధృవంగల్ పదినారు’ సినిమాలో డైరెక్టర్ టేకాఫ్ చూసి ఫిదా అయిపోయిన చైతూ.. ఆ ద్విభాషా చిత్రానికి వెంటనే ఓకే చేప్పేశాడట. అరవింద్ స్వామి ముఖ్య పాత్ర పోషిస్తున్న ఆ మూవీలో చైతూతోపాటు మరో తమిళ హీరో నటించనున్నాడని సమాచారం.  థ్రిల్లర్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కానుంది. మరి ఈ చిత్రంతో  చైతూ కోలీవుడ్ లో పాగా వేస్తాడో లేదో చూడాలి.

SHARE