Posted [relativedate]
భల్లాల దేవుడు ప్రొడ్యూసర్ అయిపోతున్నాడు. అదేనండి మన రానా ఇప్పుడు సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని సినిమాలను ఈజీగా తీసేలా ఇప్పటికే ఒక టీమ్ ను తయారు చేసుకున్నాడట రానా. బాహుబలి-2 అయిపోయాక.. ఈరోజ్ ఎంటర్ టైన్ మెంట్ బేనర్ తో టై అప్ అయి కొత్త సినిమాను చేసేందుకు ప్లాన్ జరుగుతోందని చెబుతున్నారు.
రానా ప్రొడ్యూసర్ గా అంటే హీరో కూడా అదే రేంజ్ లో ఉండాలి కదా. ఆ హీరో ఎవరో కాదు నాగ చైతన్య. నిజానికి చైతన్యతో మంచి సినిమా తీయాలని రామానాయుడు గారు… ఎంతో ప్రయత్నం చేశారట. కానీ అది పట్టాలెక్కలేదు. కానీ రామానాయుడు గారి కలను ఇప్పుడు రానా నిజం చేస్తున్నాడు. ఆయన ఇద్దరు మనవళ్లు కలిసి సినిమాను చేయబోతుండడం విశేషం.
మరాఠి సినిమా పొచ్చర్ బాయ్స్ సినిమాను రీమేక్ చేసేందుకు ప్లాన్ జరుగుతోందట. నాగ చైతన్య, రానా ఇద్దరూ సినిమాపై ఎంతో ఆసక్తిగా ఉన్నారట. మూవీకి రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ డైరెక్షన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. కాస్టింగ్ కూడా దాదాపు ఫైనల్ అయిపోయిందట. ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలిందని టాక్. చూడాలి మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో!!