చైతు, సమంత ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్..?

Posted [relativedate]

chaitu samantha engagement
టాలీవుడ్ హాట్ కపుల్ నాగచైతన్య-సమంతల లవ్ మ్యారేజ్ పై మరింత క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న నాగచైతన్య.. ఆ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన వెంటనే సమంతకు రింగ్ తొడిగేస్తాడని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. చైతూ నటిస్తోన్న సాహసం శ్వాసగా సాగిపో., ప్రేమమ్ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. సాహసం శ్వాసగా సాగిపో విడుదలకు సిద్ధం కాగా.,. ప్రేమమ్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అటు సమంత కూడా జనతా గ్యారేజ్ షూటింగ్ లో బిజీగా ఉంది. ఆ తర్వాత కూడా ఎలాంటి సినిమాలు చేసేందుకు సమంత అంగీకరించలేదు. దీంతో సెప్టెంబర్ నెలాఖర్లో ఎంగేజ్ మెంట్ కి ముహూర్తం పెట్టేయాలని ఇరుకుటుంబాలు నిర్ణయించినట్లు టాక్. ఎంగేజ్ మెంట్ అయిన రెండునెలలకి అంటే డిసెంబర్ పెళ్లి పెట్టుకునే అవకాశాలున్నట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న నాగచైతన్య-సమంత.. ఇటీవలే తమ లవ్ సంగతి బయటపెట్టారు. అందరూ అంగీకరించినా నాగార్జున బెట్టు చేయడంతో వీళ్ల పెళ్లిపై కొంత సస్పెన్స్ ఏర్పడింది. చివరికి నాగ్ కూడా కన్విన్స్ అవడంతో మ్యారేజ్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అటు అఖిల్ కూడా తన లవ్ కు నాగార్జున నుంచి క్లియరెన్స్ తెచ్చుకున్నాడు. ఐతే నాగచైతన్య పెళ్లి తర్వాతే అఖిల్ వివాహం ఉంటుదని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here