విశాఖలో మరో నిరసనకు పిలుపు..

0
311
chalasani srinivas said special status meeting on february

Posted [relativedate]

chalasani srinivas said special status meeting on february
ఏపీ కి ప్రత్యేక హోదా పోరాటం చిన్నగా రాజుకుంటున్నట్టే వుంది. ఓ వైపు జగన్ ,ఇంకో వైపు పవన్ మద్దతిచ్చినా విశాఖ లో మౌన నిరసన సక్సెస్ కాకుండా ప్రభుత్వం నిలువరించింది.ఆ నిరసన విఫలమైనా అది రగిలించిన స్పూర్తితో ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్చి లో దక్షిణ భారతీయుల ఆత్మగౌరవ శాంతియుత నిరసన జరపడానికి నిర్ణయించారు.ఇప్పుడు మరో నిరసనకు ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు ఇచ్చింది.

ఫిబ్రవరి 9 నుంచి 12 దాకా విశాఖలో ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో విశాఖలో నిరసన తెలపనున్నట్టు ఆ సంస్థ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ప్రకటించారు.ఆ నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వకుంటే ఊరుకోబోమని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రిపబ్లిక్ డే నాడు విశాఖ లో నిరసన కార్యక్రమ తీరుతెన్నులపై చలసాని శ్రీనివాస్ స్పందించారు . ఆ నిరసన కు మద్దతు ప్రకటించిన జన సేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ వెళితే బాగుండేదని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఇక వైజాగ్ దాకా వెళ్లిన జగన్ అక్కడ ఎయిర్ పోర్ట్ లో దీక్ష కొనసాగించి ఉంటే బాగుండేదని చెప్పారు.మొత్తానికి ఏపీ సర్కార్ వైజాగ్ ని పెట్టుబడులు,టూరిజం డెస్టినేషన్ పాయింట్ చేయాలనుకుంటుంటే …అది ఉద్యమాల వేదిక అయిపోతోంది.

Leave a Reply