బాబుకు జాతీయ గుర్తింపు

0
632
images-1

Posted [relativedate]

Image result for chandrababu images
ఏపీ చంద్రబాబు నాయుడు దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఒకరు. ఒకప్పుడు వాజ్ పేయి హయాంలో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. ఒకదశలో ప్రధాని పీఠం ఎక్కే అవకాశమొచ్చినా… ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసమే మొగ్గు చూపారు. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో టీడీపీకి ఆటుపోట్లు ఎదురైనప్పటికీ పార్టీని కష్టకాలంలో తన మార్కు రాజకీయంతో ముందుకు నడిపారు. అలాంటి చంద్రబాబు 2014 ఎన్నికల్లో మోడీతో పొత్తుపెట్టుకున్నారు. అనుకున్నట్టుగానే సక్సెస్ అయ్యారు.

కేంద్రం ప్రత్యేక హోదాపై తేల్చకపోయినప్పటికీ తనదైన రాజకీయ చతురతతో మోడీ నుంచి పనులు చేయించుకుంటున్నారు చంద్రబాబు. ఒక్క హోదా విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో మోడీ కూడా బాబుకు తగిన సహకారం అందిస్తున్నారు. ఈ దశలో పెద్దనోట్లు రద్దు నిర్ణయంతో ప్రధాని మోడీ వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. తనపై వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత చోటు చేసుకున్న పరిస్థితులను సమీక్షించి.. నగదు రహిత విధానాల్ని ప్రోత్సహించేందుకు వీలుగా ఏర్పాటు చేయాల్సిన విధానం కోసం ఓ సబ్ కమిటీని వేశారు. ఇక.. ఈ కమిటీలో సభ్యులుగా ఉండే నలుగురు ముఖ్యమంత్రుల్ని కేంద్రం నిర్ణయించింది. వీరిలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (జేడీయూ).. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (బీజేపీ).. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి (కాంగ్రెస్).. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కారు (కమ్యూనిస్ట్ పార్టీ) కు చోటు దక్కింది. విశేషమేమిటంటే ఈ కమిటీకి కెప్టెన్ గా చంద్రబాబును నియమించారు.

దేశం యావత్తూ నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇప్పుడు చంద్రబాబు సబ్ కమిటీకి కెప్టెన్ గా ఉండడం మంచి పరిణామం. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న చంద్రబాబు … ఈ కమిటీకి కెప్టెన్ కాబట్టి… ఇక్కడ్నుంచి మంచి సలహాలు, సూచనలు వచ్చే అవకాశముంది. అంతేకాదు జాతీయస్థాయిలోనూ చంద్రబాబు సత్తా మరోసారి అందరికీ అర్థమవుతుంది. అయితే సబ్ కమిటీకి నాయకత్వం వహించడానికి బాబు ఒప్పుకుంటారా.. లేదా.. వేచిచూడాలి.

Leave a Reply