నాన్నగారు లోకేష్ కి ఏమి చెప్పారు?

0
522
chandra babu lokesh

chandra babu lokesh

నేతల సంతానం రాజకీయాల్లోకి రావడం సాధారణమైపోయింది.ఇది ప్రజాస్వామ్యం పేరిట సాగుతున్న ఆధునిక రాజరిక వ్యవస్థలా అనిపిస్తోంది .ఇంతకీ టీడీపీ అధినేత ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారో తెలుసా ? సమాజానికి  సేవ చేయాలని నాన్నగారు చెప్పారట . టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేష్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు .అనాధ పిల్లలకు ఆశ్రయాన్నిచ్చే విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నారాలోకేష్ తో పాటు మంచులక్ష్మి పాల్గొన్నారు..తల్లిదండ్రులు లేకపోవడం అనేది ఊహిస్తేనే చాలా బాధగా ఉంటుందని లోకేష్ అన్నారు..ట్రస్ట్ ద్వారా వెయ్యిమందికి పైగా పిల్లలను ప్రత్యక్షంగా, మరో రెండువేల మందికి పరోక్షంగా సహాయం అందిస్తున్నామని లోకేష్ వ్యాఖ్యానించారు..మంచు లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వాల సాయం కోసం ఎదురుచూడకుండా అందరూ సమాజం కోసం ఏదో ఒకటి చేయాలని సూచించారు..తాను సినీనటిని కాకపోయి ఉంటే టీచర్ ను అయ్యేదాన్నని వ్యాఖ్యానించారు..

Leave a Reply