బాబు..ఎన్టీఆర్ మధ్య సయోధ్య?

Posted October 3, 2016

chandra babu ntr reconciliationఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు,యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య సయోధ్యకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎవరి ఫీల్డ్ లో వాళ్ళు ఏ మాత్రం ఇబ్బందుల్లేని పరిస్థితుల్లో వున్నప్పుడు ఈ ప్రయత్నాలు ఎందుకు జరుగుతాయి? జరిగినా అవి ఫలించే అవకాశముందా? ఎవరికైనా ఈ సందేహం రావడం సహజం.అయితే ఈ ప్రయత్నం జరగడం ఏదో మధ్యవర్తులు ఆసక్తి మాత్రమే కాదు.ఇందుకు సంబంధించి రెండు వైపులా ఇదే ఆలోచన వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. ఆ విషయం అర్ధమయ్యాకే మధ్యవర్తులు రంగంలోకి దిగినట్టు సమాచారం.

ఇటీవల సినీరంగంలో తెలుగుదేశానికున్న పరపతి తగ్గుతున్న విషయం చంద్రబాబుని కలవరపెడుతోంది.దానికి తోడు 2019 నాటికి పవన్ కళ్యాణ్ సొంత కుంపటి పెట్టుకోవడం దాదాపు ఖాయమైంది.బాలకృష్ణ ఉన్నప్పటికీ ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ట్రెండ్ కి యువకథానాయకుల అవసరముందని బాబు తో పాటు యువ నేత లోకేష్ కూడా భావిస్తున్నారు.అదే సమయంలో హిట్ సినిమాలకి సైతం రావాల్సిన స్థాయిలో కలెక్షన్స్ రాకపోవడం వెనుక టీడీపీ నాయకత్వంతో ఉన్న విభేదాలేనని ఎన్టీఆర్ ఓ నిర్ణయానికి వచ్చారు.ఆ అభిప్రాయబేధాలు పరిష్కరించుకోడానికి ఏదైనా అవకాశం వస్తే బాగుంటుందని భావిస్తున్న ఎన్టీఆర్అదే టైం లోకొన్నాళ్ల పాటు రాజకీయాలకి దూరంగానే ఉండాలని కూడా డిసైడ్ అయ్యారు. ఇద్దరి పరిస్థితిని అర్ధం చేసుకుని రెండు రంగాలతో సంబంధమున్న ఓ పెద్ద మనిషి ఇప్పటికే ఇటు బాబు ..అటు ఎన్టీఆర్ తో చూచాయగా విషయం చెప్పారట.వాళ్ళు కూడా సుముఖంగా ఉండటంతో త్వరలో ముఖాముఖి సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారట.ఆ ప్రయత్నాలు ఫలిస్తే నందమూరి,నారా కుటుంబాల అభిమానులే కాదు టీడీపీ వర్గాలు ఖుషీ అవుతాయి.

SHARE