ధర్నాలు, ఆందోళనలు చేస్తే పీడీ యాక్ట్ ..

chandra babu ordered pd actఇవీ సీఎం ఆదేశాలు: కలెక్టర్లు, ఎస్పీలతో విజయవాడలో సీఎం చంద్రబాబు తాజాగా సమీక్ష నిర్వహించారు. సదస్సు ముగింపులో శాంతిభద్రతలపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా వారికి ఆందోళనలు, ధర్నాలపై పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలపై ఆందోళనలు, ధర్నాలు చేసే వారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. పలు ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం చేపట్టే భూ సేకరణను ఎవరు వ్యతిరేకించినా.. ప్రత్యేక హోదా కోసం ఎవరైనా ఆందోళన చేసినా.. వారిపై పీడీ కేసులను పెట్టాలని ఆదేశించారు. కేవలం కేసులు పెట్టి వదిలేయకుండా  వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం స్పష్టం చేశారు. జాతీయ రహదారుల కోసం 50 వేల ఎకరాలను సేకరించాల్సి ఉందని, ఆ సేకరణలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

SHARE