బుడ్డోడితో ఆడుకున్న బాబు ..

Posted October 3, 2016

chandra babu playing with grandsonరాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా అయన ఓ మనవడికి తాతే..హోదా డిమాండ్,ప్యాకేజ్ ప్రకటనల మధ్య ఇటీవల నలిగిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు దాదాపు మూడు వారాల తరువాత ఫ్యామిలీ తో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు.ముఖ్యంగా భార్య భువనేశ్వరితో కలిసి మనవడు దేవాన్ష్ తో ఆటపాటలతో కాలం గడిపారు.పాలన,రాజకీయపరమైన ఒత్తిళ్లు పక్కన పెట్టి మనవడితో పాటు తాను చిన్నపిల్లాడైపోయారు చంద్రబాబు.

ఇటీవల కలెక్టర్లు కాన్ఫరెన్స్ లో అప్పుడప్పుడు కుటుంబంతో సరదాగా గడిపితే చురుగ్గా పనిచేయగలుగుతామని చెప్పిన బాబు అదే సూత్రాన్ని అమలు చేస్తున్నట్టున్నారు.రాజకీయాల్లో చురుగ్గా ఉండి సొంత కొడుకుతో ఆడుకోలేకపోయిన బాబు ఇప్పుడు మనవడితో ఆ సరదా తీర్చుకుంటున్నట్టున్నారు.

SHARE