చేనేతకి చంద్రన్న అభయం…

 chandra babu promise daily workers

రాష్ట్రంలో రూ.110 కోట్లు మేరకు చేనేత రుణమాఫీ ఇచ్చామని అన్నారు. ఒక్క అనంతపురం జిల్లాలో రూ.36 కోట్లు రుణమాఫీ జరిగిందని సిఎం వెల్లడించారు. ఈ ఏడాది నుంచి రాష్ట్రీయ స్వ‌స్త్ బీమా ప‌థ‌కాన్ని అమ‌లుచేస్తామ‌ని, అలాగే చేనేత కార్మికులకు సబ్సిడీ కోసం ఈ ఏడాది రూ.50 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. చేనేత కార్మికులను పూర్తిగా ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. చేనేత కార్మికుల కోసం చేనేత భవన్లు, నేతబజార్లు ఏర్పాటు చేస్తామని, చేనేత కార్మికులు ఆర్థికంగా ఎదిగేందుకు అన్ని రకాలుగా సాయం చేస్తామని హామీనిచ్చారు.

చంద్రన్న చేయూత కార్యక్రమంలో భాగంగా ఎగ్జిబిషన్ స్టాల్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఆయన మాట్లాడారు. ఒక్క అనంతపురం ధర్మవరం, వెంటకటగిరి,ఉప్పాడలలో చేనేతలు ప్రసిద్ధిగాంచాయన్నారు.చేనేత కార్మికులు చేయూతనిచ్చిన ఏకైక పార్టీ టీడీయేనని ఆయన పేర్కొన్నారు. ప్ర‌జ‌ల్లో చైత‌న్యం రావాలని స‌మాజ ప‌రిస్థితులను అర్థం చేసుకొని వారు ముందుకెళ్లాల‌ని ఆయ‌న సూచించారు. కృష్ణా పుష్క‌రాలు ఒక కులానికో, మ‌తానికో, ఏ ప్రాంతానికో సంబంధించిన‌వి కాదని ఆయ‌న పేర్కొన్నారు.

పుష్కరాలకు ఎంతో మంది వ‌స్తార‌ని ఆయ‌న అన్నారు. పుష్క‌రాల సంద‌ర్భంగా చేప‌ట్ట‌వ‌ల‌సిన అన్ని చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని పేర్కొన్నారు.
జ‌డ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా పోటీ చేయాలంటే ఒక మొక్క నాటి ఉండాలని, లేదంటే వారికి పోటీ చేసే అర్హ‌త ఇవ్వకుండా చేసే యోచన‌లో ఉన్నామ‌ని చంద్ర‌బాబు అన్నారు. ఉద్యోగ‌స్తుల‌కు ప్ర‌మోష‌న్, ఇంక్రిమెంట్లు రావాలంటే, విద్యార్థుల‌కు మార్కులు రావాలంటే కూడా మొక్క‌లు నాటాల్సిందేన‌ని ఆయన చెప్పారు. ధర్మవరంలో భవిష్యత్‌లో ఇబ్బంది లేకుండా భూగర్భ జలాలు పెంచుకోవాలన్నారు. భూగర్భ జలాలు పెంచుకున్నట్లైతే నీటి సమస్య అనేదే ఉండదన్నారు. ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తయారు చేయాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు

మంత్రి మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ కు పోలవరం వరం, ముఖ్యంగదా హంద్రీ నీవా ప్రాజెక్టు పూర్తీ చేసి అన్ని చెరువులకు నీరిచ్చి అనంతపురం జిల్లాను కరువురహిత జిల్లాగా మార్చాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయం అన్నారు. అంధ్రపదేశ్ కు కి ప్రత్యేక హోదా పై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్,వైసీపీ కి లేదని విమర్శించారు.

చేనేత కార్మికులకు పింఛన్‌ సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. త్వరలో రాష్ట్ర స్థాయిలో మెగాషో రూమ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. చేనేత కార్మికులకు రుణమాఫీ పథకం ప్రారంభించడం సంతోషకమైన అంశమని ఆయన అన్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే రూ.36 కోట్ల చేనేత రుణమాఫీ జరుగుతుందని ఆయన తెలిపారు.

SHARE