సిబిఐకి బాబు సర్కార్ కొర్రీ ..

    chandra babu sarkar giving permission cbi enquiry
     ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ అధికారుల మీద వచ్చే అవినీతి అభియోగాలపై నేరుగా సిబిఐ విచారణ జరిపేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే ఇచ్చి ఓ కొర్రీ పెట్టింది.ఏవైనా అభియోగాలు వచ్చినపుడు మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,ఎంపీ లు ,కార్పొరేషన్ చైర్మన్లు,అధికారులు,మాజీ ప్రజా ప్రతినిధుల్ని అవినీతి నిరోధక చట్టం,కేంద్ర చట్టాల కింద సిబిఐ నేరుగా విచారణ జరిపేందుకు వీలుగా సెంట్రల్ హోమ్ శాఖ ఓ ప్రతిపాదన తెచ్చింది.దీనికి కొన్ని రాష్ట్రాలు ఒప్పుకోగా మరికొన్ని తిరస్కరించాయి.ఈ ప్రపోజల్ కి బాబు సర్కార్ ఓకే చెప్పింది.అయితే ఓ చిన్న కొర్రీ పెట్టింది.సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు,ప్రాసిక్యూషన్ కి ముందు రాష్ట్ర సర్కార్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.అంటే సిబిఐ విచారణ మొదలెట్టినా ముందడుగు వేయాలంటే రాష్ట్ర సర్కార్ పర్మిషన్ కావాల్సిందే.

SHARE