ఆ చిన్నదంటే … బాబుకెందుకు మోజు?

0
732

chandra babu singapore

ముఖ్యమంత్రి చంద్రబాబు నోటివెంట ఇటీవల పట్టిసీమ మాట వినిపిస్తోంది కానీ … ఇంతకుముందు సింగపూర్ మంత్రం తెగ జపించేవారు. ఆ చిన్నదేశమంటే ఆయనకి ఎందుకంత మోజు? ఆ విషయానికే వస్తున్నాం. నిజంగానే సింగపూర్ చిన్నదే… ఎంత చిన్నదో తెలుసా? ఆ దేశ వైశాల్యం మొత్తం కలిపితే 719.1 స్క్వేర్ కిలోమీటర్లు…మన హైదరాబాద్ 650 స్క్వేర్ కిలోమీటర్లు. విషయం అర్థమైందిగా…ఆదేశం మొత్తం కలిపినా మన హైదరాబాద్ కన్నా కాస్త పెద్దది అంతే… అక్కడవుండే జనాభా కేవలం 57 లక్షలలోపు.

చిన్నదైనంత మాత్రాన, అక్కడి అభివృద్ధి బాగా జరుగుతున్నంత మాత్రాన సింగపూర్ మన చంద్రబాబుగారిని ఆకర్షించిందనుకుంటున్నారా? వీటితో పాటు అంతకుమించిన కారణం మరొకటి వుంది. అదే అక్కడి పీపుల్స్ యాక్షన్ పార్టీ… ఇదీ ఓ రాజకీయ పార్టీయేగా అని కొట్టిపారేయకండి. ఆ పార్టీ 50 ఏళ్లుగా సింగపూర్ ని పరిపాలిస్తోంది. ఆ పార్టీ దెబ్బకి ప్రతిపక్షాలు కూడా అలసిపోయాయి.

ఈ విషయం తెలిసిన బాబుగారు ఇటీవల ఆ పార్టీ విధివిధానాలు, వ్యూహాల గురించి పరిశీలించమని తన కోర్ టీమ్ తో చెప్పారట…ఆ టీమ్ ఇపుడు అదే పనిలో వుందట. ఈ పని ఎందుకో తెలుసుగా … విజన్ 50 ఇయర్స్ పవర్ … ఇపుడు అర్థమైందిగా ఆ చిన్నదంటే బాబుకెందుకు మోజో!.

Leave a Reply