హెరిటేజ్ ఫ్యూచర్ మారింది..

0
340

heritageఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న హెరిటేజ్ గ్రూప్ లోకొంత భాగం ఫ్యూచర్ మారబోతోంది.హెరిటేజ్ రిటైల్ విభాగాన్ని దేశీయ దిగ్గజం ఫ్యూచర్ గ్రూప్ సొంతం చేసుకుంది.అయితే ఈ స్టోర్స్ఎప్పటిలాగానే హెరిటేజ్ పేరుతోనే కొనసాగుతాయి.

రెండు గ్రూప్ ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 124 హెరిటేజ్ స్టోర్స్ ఇక ఫ్యూచర్ గ్రూప్ సొంతం అవుతాయి.బదులుగా ఫ్యూచర్ గ్రూప్ లో 3 .5 శాతం వాటా హెరిటేజ్ కి దక్కుతుంది.ఫ్యూచర్ గ్రూప్ సంస్థ ఇప్పటికే బిగ్ బజార్,ఈ జోన్, షాపర్స్ స్టాప్ వంటి బ్రాండ్స్ తో దేశీయ రిటైల్ రంగంలో దూసుకెళుతోంది.చురుగ్గా విస్తరణ చేపట్టిన ఇంతకుముందు మరి కొన్ని సంస్థల్ని సొంతం చేసుకుంది.తాజా ఒప్పందం వల్ల హెరిటేజ్ వినియోగదారులు,రైతులకి మరింత ప్రయోజనం ఉంటుందని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.

Leave a Reply