చంద్ర‌బాబు, జ‌గ‌న్ మ‌ధ్య టై!!

0
503
chandrababu and jagan in between elections results tie

Posted [relativedate]

chandrababu and jagan in between elections results tie
ఏపీ సీఎం చంద్ర‌బాబు, వైసీపీ అధినేత జ‌గ‌న్ కు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మిశ్ర‌మ ఫ‌లితాలు ఎదుర‌య్యాయి. జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో వైఎస్ వివేకానంద రెడ్డిపై టీడీపీ గెలిచింది. ఇక చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో జ‌గ‌న్ మ‌ద్ద‌తిచ్చిన క‌మ్యూనిస్టులు ఎర్ర‌జెండా ఎగ‌ర‌వేశారు. దీంతో ఇద్ద‌రు నాయ‌కుల మ‌ధ్య మ్యాచ్ టై అయిన‌ట్ట‌య్యింది.

మొద‌ట క‌డ‌ప గ‌డ్డ‌పై టీడీపీ జెండా పాతింది. ఎన్నో ఏళ్లుగా వైఎస్ కుటుంబం ఆధిప‌త్యం న‌డుస్తున్న ఈ జిల్లాలో వైఎస్ వివేకానంద రెడ్డి బ‌రిలో నిలిచారు. ఆ పార్టీకే ఆధిప‌త్యం ఉంది. అయినప్ప‌టికీ టీడీపీ స‌త్తా చాటింది. టీడీపీ అభ్య‌ర్థి బీటెక్ ర‌వి విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేసి జ‌గ‌న్ కు షాకిచ్చారు.

ఇక చిత్తూరు జిల్లాకు వ‌చ్చేస‌రికి ప్ర‌తిప‌క్షం వైసీపీ మ‌ద్ద‌తుతో ఇద్ద‌రు క‌మ్యూనిస్టులు విజ‌య‌దుందుభి మోగించారు. దీంతో చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్న జ‌గ‌న్ కు ఎట్ట‌కేల‌కు కొంత రిలీఫ్ ల‌భించింది. ఈ విజ‌యం జ‌గ‌న్ కు పెద్ద ఊర‌టే. ఎందుకంటే మొద‌ట టీడీపీ క‌డ‌ప విజ‌యంతో 1-0 తో లీడ్ లోకి దూసుకెళ్లినా.. చిత్తూరులో క‌మ్యూనిస్టుల విజ‌యంతో స్కోర్లు 1-1 తో స‌మంగా మారాయి. ఇద్ద‌రు బ‌లమైన నాయ‌కుల మ‌ధ్య మ్యాచ్ టై అయిపోయింది.

అయితే టీడీపీ నాయ‌కుల అభిప్రాయం మ‌రోలా ఉంది. క‌డ‌ప‌లో టీడీపీ గ్రాండ్ విక్ట‌రీ కొట్టింది. అయితే చిత్తూరులో గెలిచింది వైసీపీ కాదు. వైసీపీ మ‌ద్ద‌తిచ్చిన క‌మ్యూనిస్టులు గెలిచారు. కాబ‌ట్టి ఆ విజ‌యాన్ని వైసీపీ ఖాతాలోకి వేయ‌డం కరెక్ట్ కాదంటున్నారు. సో మ్యాచ్ 1-0 తో చంద్ర‌బాబే గెలిచార‌ని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నారు. ఇటు వైసీపీ నాయ‌కులేమో మ్యాచ్ టై అయిపోయింద‌ని వాదిస్తున్నారు. ఎవ‌రి వాద‌న ఎలా ఉన్నా రెండు పార్టీల మ‌ధ్య మ్యాచ్ చివ‌రివ‌ర‌కు ర‌స‌వత్త‌రంగా జ‌రిగిన మాట వాస్త‌వం!!!

Leave a Reply