బాబు, జగన్ ఒక ఊరు వారవుతారా?

 Posted November 1, 2016

chandrababu and jagan in same hometown
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు…ప్రతిపక్షనేత,వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒకే ఊళ్లో వుండే అవకాశాలు ఉన్నాయా? రాజకీయ బద్ద శత్రువులైన వీరిని నివాసం విషయంలో మాత్రం తాడేపల్లి మండలం ఆకట్టుకుంటోంది.అందులోను ఉండవల్లి గ్రామం ఇంకాస్త ఆకర్షణీయంగా కనిపిస్తోంది.ఇప్పటికే బాబు ఆ గ్రామ పరిధిలోని లింగమనేని గెస్ట్ హౌస్ లో వుంటున్నారు.అక్కడే ఓటు నమోదుకి మొగ్గు చూపారు.ఇప్పుడు తాజాగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా వుండవల్లిలోనే అయన సభ్యత్వం తీసుకుంటున్నారు. ఇక పార్టీ పరంగా చూస్తే టీడీపీ కి ఉండవల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో వున్న పట్టు స్థానికంగా లేదు.అయినా బాబు ఆ ఊరినే ఎంచుకున్నారు.
ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకోడానికి నిర్ణయించుకున్న వైసీపీ అధినేత జగన్ మనసు కూడా ఉండవల్లి వైపే లాగుతోంది.అయితే ఇంటలిజెన్స్ చురుగ్గా వ్యవహరించే ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం మీద అయన తర్జనభర్జన పడుతున్నారు.ఇక సామాజికంగా,రాజకీయంగా ఉండవల్లి ,తాడేపల్లి జగన్ అవసరాలకి తగ్గట్టే ఉండటం జగన్ కి కలిసొచ్చే అంశం.ఏమైనా సీఎం ,ప్రతిపక్ష నేత ఇద్దరూ ఇక్కడే మకాం అన్న ఆలోచన ఉండవల్లి వాసులకి కిక్ ఇస్తోంది.

SHARE