ముందస్తు ముహూర్తం.. ఎవరి ఆలోచన వారిదే

0
563
chandrababu and kcr ready to participated before elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

chandrababu and kcr ready to participated before electionsరాజకీయాల్లో తన, పర అన్న తేడా ఉండదు. ఎవరితో అయినా సరే అవసరమైనంత వరకే ఫ్రెండ్ షిప్. కుదరకపోతే కటీఫే. మొహమాటాలు, బంధుత్వాలకు అస్సలు తావులేదు. ఇక తెలుగు రాజకీయాలు అందులో ఓ ఆకు ఎక్కువే చదివాయి. అందుకే అన్నింటినీ దగ్గరుండి చూసిన ఇద్దరు చంద్రులు.. ఇప్పుడు ముందస్తు ఎన్నికల జపం చేస్తున్నారు. కేసీఆర్ ఫస్ట్ టైమ్ సీఎం కాబట్టి ముందస్తు జపం చేస్తున్నా.. 2004లో ముందస్తుకు వెళ్లి భంగపడ్డ చంద్రబాబు కూడా మళ్లీ అదే పాట పాడటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.

అయితే ఇక్కడ అసలు మర్మం వేరే ఉంది. ఉమ్మడి ఏపీకి, ఇప్పటి ఏపీకి చాలా తేడా ఉంది. ప్రస్తుతం కేంద్రం నుంచి ఆశించినంతగా నిధులు రావడం లేదు. దీంతో ముందస్తుకు వెళ్లి మరో ఐదేళ్లు తనకు ఢోకా లేకుండా చేసుకోవాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు. అందుకే నేరుగా ముందస్తు అని చెప్పకపోయినా.. పరోక్షంగా పార్టీకి తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని నేతలకు ఆదేశాలిచ్చారు. బాబు ఏ విషయమైనా ఇలాగే చెబుతారు కాబట్టి.. తమ్ముళ్లకు మాత్రం అసలు విషయం అర్థమైపోయింది.

ఇటు తెలంగాణలో కూడా కేసీఆర్ నగారా మోగించేశారు. ఆరు నెలలుగా వరుస హామీలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వీరి హడావిడికి మూల కారణం మోడీ ఒకేసారి ఎన్నికల మంత్రమే. ఆయన 2018 చివర్లో అన్ని రాష్ట్రాలకు ఎన్నికలు పెడతారని వీరికి ఉప్పందింది. దీంతో చంద్రులు ముందే తొందరపడుతున్నారు. అటు నియోజకవర్గాల పునర్విభజనపై కూడా ఆశలు సజీవంగా ఉన్నాయి. కేంద్రం ముందస్తు ఎన్నికలు పెట్టేముందే.. ఆ పని పూర్తిచేస్తుందన్న సంకేతాలు రావడంతో.. తెలుగు సీఎంలు ఫుల్ జోష్ లో ఉన్నారు.

Leave a Reply