Posted [relativedate]
ఏపీలో కాంగ్రెస్ కు ఆది నుంచి అండగా వుంటున్నారు ఎస్సీలు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత కొంత చీలిక వచ్చినా మెజారిటీ ఎస్సీలు హస్తం వైపే వుంటూ వచ్చారు. వైసీపీ ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ లోని ఎస్సీ శ్రేణులు జగన్ వెంట నడిచాయి. క్రిస్టియా నీటి ప్రభావం వల్ల దేశం శ్రేణుల్లో కూడా కొంత భాగం వైసీపీ బాట పట్టారు. ఎన్నికల ఫలితాల తర్వాత కొద్దికొద్దిగా మార్పు వస్తోంది. అయితే ఇప్పటికీ దేశానికి ఎస్సీ నేతల కొరతవుంది. ఈ కొరతను పూడ్చుకోడానికి చంద్రబాబు అనుసరిస్తోన్న వ్యూహం ఏంటంటే?
ప్రత్యర్థి పార్టీల నుంచి వస్తున్న ఎస్సీ నేతలకు చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. తద్వారా నేతలతో పాటు ప్రత్యర్థి శ్రేణులను కూడా ఆకర్షించవచ్చని భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన జూపూడి ప్రభాకరరావు పార్టీలో చేరిన వెంటనే పెద్దపీట వేశారు బాబు. సాంకేతిక కారణాలతో ఇక్కడ పదవికి ఇబ్బందులు ఎదురైనా APSCCFC చైర్మన్ గా చేశారు. హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కారెం శివాజీకి ఎస్సీ, ఎస్టీ చైర్మన్ గా అవకాశమిచ్చారు. తాజాగా డొక్కా మాణిక్య వరప్రసాద్ కి కనీస వేతన బోర్డు చైర్మన్ పదవి ఇచ్చారు. మొత్తానికి వలస నేతలకి పెద్ద పీట వేసి ఎస్సీ నాయకుల లోటు పూడ్చుకుంటున్నారు చంద్రబాబు. ఇది చూసి వైసీపీ, కాంగ్రెస్ నేతలు కొందరు టీడీపీ వైపు చూస్తున్నారట.